- ఫిబ్రవరి 1వ ఎస్ 23 సిరీస్‌లో మూడు కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు
- భారత్‌తో సహా పలుదేశాల మార్కెట్లలో ఈ సిరీస్ విడుదల
- 200ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సార్, 12ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా
- రెండు 10ఎంపీ టెలిఫోటో సెన్సార్‌తో రియర్ క్వాడ్-కెమెరా

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ నెక్స్ట్ గెలాక్సీ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఫిబ్రవరి 1వ తేదీన జరగనున్న అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో గెలాక్సీ ఎస్ 23 సిరీస్‌లో మూడు కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించేందుకు శాంసంగ్ సిద్ధమవుతోంది. భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా వివిధ మార్కెట్‌లలో ఈ సిరీస్ విడుదల కానుంది. ఈ క్రమంలో ధర, డిజైన్, ఫీచర్ల గురించి లీక్‌లు మొదలయ్యాయి.

స్పెసిఫికేషన్ల పరంగా, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ 200ఎంపీ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో వస్తోంది. 12ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, రెండు 10ఎంపీ టెలిఫోటో సెన్సార్‌తో రియర్ క్వాడ్-కెమెరా మరో ప్రధాన ఆకర్షణ.అయితే యాపిల్ 14 ప్రో మాక్స్‌తో పోలిస్తే 8జీబీ ర్యామ్ సహా, 200 ఎంపీ కెమెరా, డిస్‌ప్లే చివరికి ధర విషయంలో మెరుగ్గా ఉన్న శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్, యాపిల్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.
