Free Porn
xbporn
26.2 C
Hyderabad
Friday, October 18, 2024
spot_img

ఆర్జీవీ డెన్‌లో ‘సగిలేటి కథ’ ఫస్ట్ లిరికల్ లాంచ్

హీరో నవదీప్ సీ-స్పేస్ సమర్పణలో రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘రాజశేఖర్ సుద్మూన్’ రచన, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీతో దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్‌లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా కలిసి నిర్మించారు. ఇప్పటికే, విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు అనుహ్య స్పందన లభించింది. డ్యాషింగ్ డైరెక్టర్ ఆర్జీవీ డెన్ ఆఫీస్‌లో, ఈ చిత్రం ఫస్ట్ లిరికల్ ‘ఏదో జరిగే’ వీడియో సాంగ్‌ని ఎంతో గ్రాండ్‌గా ఆర్జీవీ చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ ఆర్జీవీ మాట్లాడుతూ ‘‘సగిలేటి కథ సినిమా ట్రైలర్ చూశాక నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఈ సినిమా ఇంత ఘన విజయంగా కంప్లీట్ చేసి ముందుకి తీసుకెళ్తున్న డైరెక్టర్ ‘రాజశేఖర్ సుద్మూన్’కి, బ్యూటిఫుల్‌గా పాడి అందరిని కవ్వించిన కీర్తన శేష్‌కి నా ఆల్ ది బెస్ట్. ఈ సినిమా సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకి రానుంది.’’ అన్నారు.

ప్రొడ్యూజర్స్ దేవీప్రసాద్ బలివాడ మాట్లాడుతూ ‘‘నేను పుట్టిన సంవత్సరంలో, ఆర్జీవీ సినిమాల్లోకి రావడం. నా రెండు సంవత్సరాలప్పుడు ‘శివ’ మూవీ కి ఆర్జీవీ డైరెక్ట్ చెయ్యడం, నాకు ఊహ తెలియని వయసులో ‘శివ’ మూవీ చూసి ‘శివ’ అనే డైలాగ్ చెప్పడం. అప్పటి నుంచి మా పేరెంట్స్ నన్ను ముద్దుగా ‘శివ’ అని పిలిచేవారు. ఈ విషయం చెప్పి ప్రతిసారి మా పేరెంట్స్ గుర్తు చేస్తుంటారు. నాకు తెలియకుండానే ఆర్జీవీ గారు నా చిన్నప్పటి నుంచి ఇన్ఫ్లూయెన్స్ చేశారు. అదే విధంగా నేను సినిమాల్లోకి రావడానికి ఒక బీజం నాటారు. నేను ప్రొడ్యూజ్ చేసిన మొదటి సినిమా ‘కనుబడుటలేదు’ మూవీ నుండి ‘సగిలేటి కథ’ వరుకు మా మూవీస్‌కి ఆర్జీవీ గారు హెల్ప్ చేస్తున్నందుకు రియల్లీ థ్యాంక్ యు’’ అన్నారు.

డైరెక్టర్ రాజశేఖర్ సుద్మూన్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. మా సినిమా సాంగ్ ని ఆర్జీవీ గారు చేతుల మీదగా చేయడం వళ్ళ మాకు ఎంతో ఎనర్జీ వచ్చింది. నేను ఆయనికి ఎంతో రుణపడి ఉంటాను. అలాగే, మా సినిమా నీ ప్రెసెంట్ చేస్తున్న హీరో నవదీప్ ఎంత చెప్పినా తక్కువే, ఎంత బిజీగా గా వున్న ఇమ్మిడియట్ గా రెస్పాండ్ అయ్యి మాకు కావలిసిన థింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు..థ్యాంక్ యు నవదీప్ అన్నా’’ అని అన్నారు.

ప్రొడ్యూజర్స్ అశోక్ మాట్లాడుతూ ‘‘థ్యాంక్ యు ఆర్జీవీ గారు…మా సాంగ్ ని లాంఛ్ చేసినందుకు…ఈ సాంగ్ ఔట్ పుట్ బాగొచ్చింది. ఒక మంచి మెలోడీ సాంగ్ అవ్వుతుందని, ఎంతో నమ్మకంతో అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను.’’ అన్నారు.

సీ స్పెస్ కో-ఫౌండర్ పవన్ మాట్లాడుతూ ‘‘నేను ఈ మూవీ చూసినప్పుడు సినిమా బాగుండటంతో పాటు, టీం అందరు కసితో కనిపించారు. సో, టాలెంట్ ఉంటే తప్పకుండా సి స్పెస్ టీం ముందుండి ప్రోత్సహిస్తుంది.’’ అన్నారు.

హీరో ‘రవి మహాదాస్యం’ మాట్లాడుతూ ‘‘సగిలేటి కథ ఒక బ్యూటిఫుల్ అండ్ మ్యూజికల్ మూవీ. ఈ సినిమాలో ప్రతి సాంగ్ బాగుంటుంది. ముఖ్యంగా, ఏదో జరిగే పాట హాయిగా పాడుతూ నిద్రలోకి జారుకోవచ్చు. కాంటెంట్ ఉన్న సినిమాలు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. చాలా తక్కువ సమయంలోనే మా మూవీ ట్రైలర్ మిళియన్స్ వ్యూస్ రీచ్ అయ్యాయి, అదే విధంగా ఈ సాంగ్ రీచ్ అవ్వుతుందని నమ్మకంతో ఉన్నాం… థ్యాంక్ యు సో మచ్’’ అన్నారు.

హీరోయిన్ ‘విషికా లక్ష్మణ్’ మాట్లాడుతూ ‘‘ఆర్జీవీ గారికి థ్యాంక్ యు…షూటింగ్‌లో సాంగ్ వింటున్నప్పుడు నేను ఒక ట్రాన్స్‌లోకి వెళ్లేదాన్ని. అంతే కాకుండా, సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు రొమాంటిక్‌గా చాలా ఎంజాయ్ చేస్తూ యాక్టింగ్ చేశాను’’ అన్నారు.

నటీనటులు: రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్, నరసింహా ప్రసాద్ పంతగాని
రచన, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్: రాజశేఖర్ సుడ్మూన్
కో-రైటర్: శశికాంత్ బిల్లపాటి, మని ప్రసాద్ అరకుల
నిర్మాతలు: అశోక్ మిట్టపల్లి, దేవీప్రసాద్ బలివాడ
ఇన్ అసోసియేషన్ విత్: సి స్పెస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరేష్ మాదినేని
అసోసియేట్ ప్రొడ్యూసర్: పుష్పాభాస్కర్, సునీల్ కుమార్ ఆనందన్, లీలా కృష్ణ కొండేపాటి
లైన్ ప్రొడ్యూసర్: చందు కొత్తగుండ్ల
సంగీతం: జశ్వంత్ పసుపులేటి
నేపథ్యసంగీతం: సనల్ వాసుదేవ్
సింగర్స్: కీర్తన శేష్, కనకవ్వ
సాహిత్యం: వరికుప్పల యాదగిరి, పవన్ కుందాని, రాజశేఖర్ సుడ్మూన్, శశికాంత్ బిల్లపాటి, జశ్వంత్ పసుపులేటి
పి.ఆర్.ఓ: తిరుమలశెట్టి వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్స్: హేమంత్ జి, ఐశ్వర్య కులకర్ణి
కాస్ట్యూమ్ డిజైనర్: హర్షాంజలి శేనికేషి
సౌండ్ డిజైనర్: యతి రాజు
సౌండ్ మిక్సింగ్: శ్యామల సిక్దర్
డి.ఐ: కొందూరు దీపక్ రాజు
పబ్లిసిటీ డిజైనర్: యమ్.కే.యస్ మనోజ్

Latest Articles

కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మధ్య మూసీ ఫైట్‌

తెలంగాణలో మూసీ సుందరీకరణపై ఢీ అంటే ఢీ అంటున్నాయి అధికార విపక్షాలు. ఇదే అంశంపై ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్‌ ఇవ్వగా.. ఇప్పుడు విపక్ష బీఆర్ఎస్ సైతం అందుకు సిద్ధమవుతోంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్