21.2 C
Hyderabad
Sunday, September 28, 2025
spot_img

Rules Ranjaan: రూల్స్ రంజన్ ట్రైలర్‌కు డేట్ ఫిక్స్

‘రాజా వారు రాణి గారు’, ‘SR కళ్యాణ మండపం’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం తాజా చిత్రం ‘రూల్స్ రంజన్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘నీ మనసు నాకు తెలుసు’, ‘ఆక్సిజన్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్నారు.

‘రూల్స్ రంజన్‌’ సినిమాని స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు. అమ్రిష్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ‘ఎందుకు రా బాబు’, ‘సమ్మోహనుడా’, ‘నాలో లేనే లేను’ అనే మూడు పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి పాట దేనికదే ప్రత్యేకను చాటుకుంటూ కట్టిపడేశాయి. పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి.

‘సమ్మోహనుడా’ అనే మెలోడీ పాట యూట్యూబ్‌లో 14 మిలియన్ల మార్కును దాటి విశేష ఆదరణ పొందుతోంది. ‘నాలో లేనే లేను’, ‘ఎందుకు రా బాబు’ పాటలు కూడా తక్కువ సమయంలోనే 6 మిలియన్లు మరియు 3 మిలియన్ల వీక్షణలను సంపాదించి సత్తా చాటాయి.

పాటలకు వస్తున్న అద్భుతమైన స్పందనతో ఉల్లాసంగా ఉన్న నిర్మాతలు తాజాగా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. భారీ అంచనాలు నెలకొన్న ‘రూల్స్ రంజన్’ మూవీ ట్రైలర్ వచ్చే శుక్రవారం అనగా ఆగస్టు 18న విడుదల కానుంది. భావోద్వేగాలు, ప్రేమ, హాస్యం, అద్భుతమైన సంగీతం కలగలిసిన ఈ విందుభోజనం లాంటి చిత్రం కుటుంబ ప్రేక్షకులను, యువతను ఆకట్టుకునేలా ఉంటుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది.

ఇప్పటికే సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ రెండో వారంలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా విడుదల తేదీని ప్రకటించనున్నారు. వెన్నెల కిషోర్, హైపర్ ఆది, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్, సుబ్బరాజు, అజయ్, గోపరాజు రమణ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అన్నూ కపూర్, సిద్ధార్థ్ సేన్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, అభిమన్యు సింగ్ మరియు గుల్షన్ పాండే సహా పలువురు హిందీ నటులు కూడా రూల్స్ రంజన్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా దులీప్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్ గా ఎం. సుధీర్ వ్యవహరిస్తున్నారు.

తారాగణం: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్ధార్థ్ సేన్

సాంకేతిక నిపుణులు:

రచన, దర్శకత్వం: రత్నం కృష్ణ
బ్యానర్: స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్
సమర్పణ: ఏఎం రత్నం
నిర్మాతలు: దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి
సహ నిర్మాత: రింకు కుక్రెజ
సంగీత దర్శకుడు: అమ్రిష్ గణేష్
డీఓపీ: దులీప్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్ : ఎం. సుధీర్
ఎడిటర్ : వరప్రసాద్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్