స్వతంత్ర వెబ్ డెస్క్: పుంగనూర్ లో శ్రీకాకుళం వాసులను చొక్కాలిప్పించిన ఘటన చూసి తాను షాక్ కి గురయ్యానని నారా భువనేశ్వరి తెలిపారు. ఈ ఘటన ప్రజలందరినీ నివ్వెరపరిచిందని ఆమె ఓ ట్వీట్ చేశారు. దాదాపు 30 ఏళ్ల కిందట బీహార్ లో కూడా ఇంత అరాచక పరిస్థితులు లేవు అన్నారు. ఏపీలో రౌడీ రాజకీయానికి ఈ దాి నిదర్శనమన్నారు. తండ్రి లాంటి తమ నేత చంద్రబాబును అరెస్ట్ చేస్తే సైకిల్ యాత్ర చేసుకునే హక్కు వారికి లేదా..? ఎల్ల కాలం ఈ నియంతల పెత్తనం సాగదన్నారు. ఈనెల 24న నారా భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శంచుకొని అదే రోజు చంద్రబాబు స్వగ్రామం నారా వారి పల్లికి వెళ్తారని టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో నారా లోకేష్ తెలిపారు. ఈనెల 25న చంద్రగిరి నియోజకవర్గం నుంచి నిజం గెలవాలి అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్ వార్త విని ఆవేదనతో చనిపోయిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నట్టు తెలిపారు.