27.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

తెలంగాణ సాధనలో గులాబీ పార్టీ ప్రస్థానం

  ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి. అదే ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి. పేరు మారినా, పార్టీ ఒక్కటే. అయితే అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమే. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి జాతీయ పార్టీ. పదేళ్ల కిందట భారతదేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఓ సంచలనం . అనేక అడ్డంకులు, అవరోధాలు దాటుకుంటూ ముందుకు సాగింది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్థానం. ఒకవైపు ఉవ్వెత్తున ఎగసే ఉద్యమం మరో వైపు ఆంధ్రా పాలకులు కుట్రలు, కుతంత్రాలు. అయినా గులాబీ పార్టీ ఎక్కడా వెనకడుగు వేయలేదు. టీఆర్ఎస్‌ది సింగిల్ అజెండానే. అదే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన. ఆ దిశగా గులాబీ పార్టీ ఉద్యమించింది. టీఆర్ఎస్ మహోజ్వల పోరాటం ఫలితంగా 2014 జూన్‌ రెండున తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవతరించింది. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను గులాబీ పార్టీ సాకారం చేసింది.

చరిత్రలో అందరూ ఉంటారు. కొందరే చరిత్ర సృష్టిస్తారు. కేసీఆర్ నాయకత్వంలో పురుడుపోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితిది కూడా ఓ చరిత్రే. ఈ చరిత్రనే ఇప్పుడు అందరూ స్మరించుకుంటున్నారు. టీఆర్ఎస్ ఏర్పడినప్పుడు కల్వ కుంట్ల చంద్రశేఖరరావు వెంట చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ జెండా పట్టుకుని కేసీఆర్‌ నడిచిన ప్పుడు ఆయనతో అడుగులో అడుగేసిన వాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. అయినప్పటికీ కేసీఆర్ వెనుకడుగు వేయలేదు. మనోధైర్యం కోల్పోలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉక్కు సంకల్పంతో ముందుకు సాగారు కేసీఆర్.

టీఆర్‌ఎస్ చరిత్రలో ఎన్నో మలుపులు . ఎన్నెన్నో దశలు. ఈ మలుపులు, దశలన్నిటినీ దాటుకుంటూ ముందుకెళ్లింది తెలంగాణ రాష్ట్ర సమితి. ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా తెలంగాణ సమాజంలోకి టీఆర్ఎస్ చొచ్చుకుపోయింది. ఓసారి చరిత్రలోకి వెళితే, 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటైంది. ఇలా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు అడుగడుగునా అన్యాయం జరిగింది. పెద్ద మనుషుల ఒప్పందంలో ఉల్లంఘనలు జరిగాయి. ముల్కీ నిబంధనలు అమలు కాలేదు. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో తెలంగాణవాళ్లకు అన్యాయం జరిగింది. ఒకటని కాదు. మరోటని కాదు. అనేక రంగాల్లో ఆంధ్రా పాలకుల పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆంధ్రా పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు తిరగబడ్డారు. ఈ తిరుగుబాటే 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమానికి నాంది పలికింది. తొలిదశ తెలంగాణ ఉద్యమం మహోద్యమంగా కొనసాగింది. యావత్ తెలంగాణ సమాజం ఈ ఉద్యమంలో పాల్గొంది. ఊరూవాడా ఏకమయ్యాయి. మా తెలంగాణ మాగ్గావాలే  అంటూ తెలంగాణ ప్రజలు నినదించారు. జనానికి తిండి, నిద్ర పట్టలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఒక్కటే ప్రజల ఆలోచనగా మారింది. ఏది ఏమైనా తెలంగాణ సాధించుకుని తీరాలన్న పట్టుదల ప్రజల్లో పెరిగింది. తెలంగాణలో ఏ గల్లీలో చూసినా ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ఆందోళనలూ, ధర్నాలే. ప్రజలంతా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఒక్కటై నినదించారు.

అయితే ఒక దశలో తొలిదశ తెలంగాణ ఉద్యమం హింసాత్మకంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమాన్ని అణచివేయడానికి 1969 జూన్‌లో సైన్యాన్ని రంగంలోకి దింపింది కేంద్రప్రభుత్వం. తొలిదశ ఉద్యమంపై ఉక్కుపాదం మోపింది కేంద్ర ప్రభుత్వం. ఉద్యమకారులపై లాఠీ ఝళిపించింది సైన్యం. కథ అక్కడితో ఆగలేదు. ఉద్యమకారులపై కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు చనిపోయారు. ఈ నేపథ్యంలో కేంద్రం అండతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసింది. ఆంధ్రా పాలకుల అణచివేతతో తెలంగాణ తొలిదశ ఉద్యమం తాత్కాలికంగా చల్లబడింది. తెలంగాణ లో మెల్లమెల్లగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి చాలాకాలం పట్టింది. అయితే ప్రజల గుండెల్లో తెలంగాణ వాదం సజీవంగానే మిగిలింది. ప్రజలకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై మమకారం పోలేదు. ఎలాగైనా ప్రత్యేక రాష్ట్రం సాధించి తీరాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. అయితే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఉద్యమ రూపం ఇచ్చే నాయకులు ఎవరూ కనుచూపుమేరలో కనపడలేదు. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రజలకు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కనిపించారు.

   కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణలో అప్పటికే ఒక ప్రముఖ రాజకీయవేత్త. ఎమ్మే చదువు కున్నారు. యువజన కాంగ్రెస్‌ నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కేసీఆర్ ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలంగాణ సాధించాలని నిర్ణయించుకునేనాటికి కేసీఆర్ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. అంతేకాదు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వా ల్లో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా కేసీఆర్‌కు ఉంది. తెలంగాణ ప్రజల గుండె చప్పుడును కేసీ ఆర్ అర్థం చేసుకున్నారు. పదవుల కంటే తెలంగాణ సాధనే ముఖ్యమని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. తెలంగాణ సాధన కోసం ప్రజలతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కల్వకుంట్ల చంద్రశేఖర రావు వెంటనే కార్యాచరణలోకి దిగారు.

      అది 2001 సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీ. ప్రత్యేక తెలంగాణను కోరుకునే కొంతమంది మిత్రులతో కలిసి పెద్దాయన కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యానికి చేరుకున్నారు కేసీఆర్. మిత్రులతో సమా లోచనల తరువాత తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు కేసీఆర్. అలా జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. అవి టీఆర్‌ఎస్ అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న రోజులు. తెలంగాణ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని గులాబీ పార్టీ వదులుకోలేదు. ఈ నేపథ్యం లో 2001 మే 17న కరీంనగర్‌లో సింహగర్జన పేరుతో టీఆర్ఎస్‌ బహిరంగ సభ నిర్వహించింది. సింహ గర్జన సభ సూపర్ డూపర్‌గా హిట్ అయింది. సింహగర్జన బహిరంగ సభ విజయవంతం కావడంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో తొలి అడుగు పడినట్లయింది.

    సింహగర్జన బహిరంగ సభ హిట్ కావడంతో గులాబీ పార్టీ నాయకుల్లో ధీమా పెరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా ప్రజలను తాము కదిలించగలమన్న భరోసా గులాబీ పార్టీ నాయకుల్లో పెరిగింది. దీంతో తెలంగాణవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో నల్లగొండ, పాలమూరు, వరంగల్, నిర్మల్‌లో భారీ బహిరంగ సభలు నిర్వహించింది గులాబీ పార్టీ. దీంతో తెలంగాణ ప్రజలు, గులాబీ పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. టీఆర్‌ఎస్ సభలకు జనం భారీ సంఖ్యలో రావడం మొదలైంది. ఇలా తెలంగాణ సమాజంలో గులాబీ పార్టీ తన స్థానాన్ని పటిష్టపరచుకుంది. మెల్లమెల్లగా తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజల గొంతుకగా మారింది. టీఆర్ఎస్ ఎక్కడ సదస్సులు పెట్టినా, బహిరంగ సభలు నిర్వహించినా ప్రజలు తండోపతండాలుగా రావడం మొదలైంది. గులాబీ పార్టీ వైపు యావత్ తెలంగాణ సమాజం కదిలింది. రైతులు, ఉద్యోగ సంఘాలు, మేధావులు, నీటిపారుదలరంగ నిపుణులు అందరూ టీఆర్ఎస్‌తో కలిసి నడవడం మొదలె ట్టారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ సమాజంలో గులాబీ పార్టీ ఒక బలమైన రాజకీయ శక్తిగా అవతరిం చింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్