స్వతంత్ర వెబ్ డెస్క్: టీమ్ ఇండియాతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ), సెలెక్టర్లను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. టీమిండియాలో చిన్నమార్పు కెప్టెన్ రోహిత్ శర్మకు సమస్యగా మారింది. సోషల్ మీడియాలో కెప్టెన్ రోహిత్ శర్మకు అభిమానులు శత్రువులుగా మారారు. ఓ వివాదం కారణంగా సోషల్ మీడియాలో దుమారం రేగింది.
వెస్టిండీస్‌తో గురువారం బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించలేదు. దీంతో పాటు టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇషాన్ కిషన్‌ను వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా చేర్చిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌కు కూడా అవకాశం ఇచ్చాడు. రోహిత్ శర్మ తీసుకున్న ఈ నిర్ణయం అగ్నికి ఆజ్యం పోసింది.
సోషల్ మీడియాలో, అభిమానులు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను దారుణంగా ట్రోల్ చేశారు. ఏ పొరపాటు చేశాడని సంజూ శాంసన్‌కు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ సమయంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) సెలక్షన్ ప్యానెల్‌లో ముంబై లాబీ ఆధిపత్యంపై అభిమానులు కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ ఛైర్మన్ మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ కూడా ముంబైకి చెందినవాడే కావడం గమనార్హం.