అనకాపల్లి(Anakapalle) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాయకరావుపేట మండలం సీతారామపురం జంక్షన్ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి వైజాగ్ వెళ్తుండగా దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 7సంవత్సరాల బాలిక ఉంది. అంబులెన్స్ లో క్షతగాత్రులను తుని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.
మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో పకోడి దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. పాలకొండలోని గేదెలవారి వీధిలో ఇంటి ముందు వున్న పకోడి షాపు లోని గ్యాస్ బండ వద్ద చెలరేగిన మంటలు ఇంట్లోకి వ్యాపించడంతో మంటల్లో చిక్కుకుని బాగ్యలక్మి (65)తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందింది. సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి ఇంట్లోని మరో వ్యక్తిని కాపాడారు.
Read Also: AP Group 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా.. కారణాలివే..
Follow us on: Youtube, Instagram, Google News