ఏపీలో ఎన్నికల వాతావరణం అలుముకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా ఇప్పుడే రాజకీయాలు వేడెక్కాయి. ఎందుకంటే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు(Early Elections) వచ్చే సూచనలు కనపడుతున్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jaganmohan Reddy) ఇటీవల గవర్నర్ తో భేటీ అయిన అనంతరం వారం రోజుల వ్యవధిలోనే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ(Modi), కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit shah)ను కలిసి వచ్చారు. దీంతో జగన్ ముందుస్తు ఎన్నికలకు వెళ్లనున్నారనే వార్తులు ఊపందుకున్నాయి. ప్రతిపక్షా నేతలు కూడా ఏపీలో మందస్తు వచ్చే అవకాశం ఉందని.. అందుకు తాము కూడా రెడీగా ఉన్నామని ప్రకటనలు చేస్తున్నారు.
APRIL FOOOOOOL 🤣🤣🤣 https://t.co/JvsORKiOGg
— Ram Gopal Varma (@RGVzoomin) April 1, 2023
ఈ క్రమంలో వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ramgopal varma) చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. వైసీపీ ముఖ్య నాయకుల నుంచి అందిన సమాచారం మేరకు జూన్ మొదటివారంలోనే అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉందని.. డిసెంబర్‌లో ఎన్నికలు ఉండే అవకాశం ఉందంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. అయితే కాసేపటికే ఏప్రిల్ ఫూల్(AprilFool) అంటూ మరో ట్వీట్ చేశాడు. ఏప్రిల్ ఫూల్ అని ఆర్జీవీ సమర్థించుకున్నా అదే నిజమని విపక్షాలు చెబుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు ఢిల్లీ వెళ్లిన జగన్.. ముఖ్యంగా ముందస్తు ఎన్నికలపైనే ఇదే విషయంపై ప్రధాని మోదీతో చర్చించారని వైసీపీతో పాటు మిగిలిన పార్టీల నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో జగన్ పై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని.. పరిస్థితి చేయి దాటకముందే తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్లాలని జగన్(Jagan) భావిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు.