రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు.. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి ప్రభావంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే, రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో ఉంటూ నియోజవర్గానికి రాకపోవడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు.
అయితే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా విపక్షాలు విమర్శలు మాని ప్రజలకు సహాయం చెయ్యాలని కౌంటర్ ఇవ్వడం.. ఆ వెంటనే పోస్టర్లు వెలవడం పట్ల బిఆర్ఎస్ హస్తమే అయి ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏది ఎలా ఉన్నా మా నాయకుడు కనపడటం లేదు.. అనే పోస్టర్లు వెలువడటం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపింగ్ గా మారింది.