స్వతంత్ర వెబ్ డెస్క్: ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి తెలుగుదేశం పార్టీ నుంచి డబ్బులు తెచ్చి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి ఒక దొంగ అని మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. సుప్రీంకోర్టులో జరిగిన విచారణతో ఆయనకు రిలీఫ్ రాలేదని, విచారణ జరగాల్సిందేనంటూ నొక్కిచెప్పిందని గుర్తుచేశారు. తప్పు చేసినందుకు విచారణ జరగడం ఖాయం.. జైలుకు వెళ్ళడం అంతకంటే ఖాయం అని మంత్రి వ్యాఖ్యానించారు. విచారించవద్దంటూ హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్ళారని, ఎక్కడా ఆయనకు ఊరట రాలేదని, తప్పు చేసినందుకు విచారణ ఎదుర్కోవాల్సిందేనంటూ సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందన్నారు. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులోనైనా ఆయన జైలుకు వెళ్ళడం పక్కా అని అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు పై వ్యాఖ్యలు చేశారు.