రాష్ట్రంలో సీఎం రేవంత్ వర్సెస్ హరీష్‌రావు అన్న చందంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు మరోసారి ఫైర్ అయ్యారు. రేవంత్‌వి చిట్‌చాట్‌లు కాదు.. చీట్‌చాట్‌లు అంటూ ఎద్దేవా చేశారు. ఆయన రాష్ట్రంలో రైతులకు జరిగిన రుణమాఫీపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితువు పలికారు.రేవంత్ స్వగ్రామం కొండారెడ్డిపల్లి లేదా సంగారెడ్డికి రాహుల్ గాంధీని తీసుకెళ్దామని.. అక్కడ రైతులకు రుణమాఫీ అయిందో లేదో అడుగుదామని సవాలు విసిరారు. రేవంత్ రెడ్డి రైతులనే కాదు.. రాహుల్ గాంధీని కూడా మోసం చేశారని ఫైర్ అయ్యారు.