తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది. ఒకవైపు అగ్రనేతలను రంగంలోకి దింపడమే కాకుండా రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో వేగం పెంచారు. రోజుకు మూడు నుంచి నాలుగు చోట్ల జనజాతర సభల్లో పాల్గొంటున్నారు. ఇవాళ నిర్మల్, గద్వాల, తుక్కుగూడ, శంషాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. నిర్మల్, గద్వాల జన జాతర సభలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారు. ఉదయం 11 గంటలకు రాహుల్ గాంధీతో కలిసి నిర్మల్ జన జాతర సభలో పాల్గొంటారు రేవంత్ రెడ్డి. సాయంత్రం 5 గంటలకు రాహుల్ గాంధీతో కలిసి గద్వాల జన జాతర సభకు హాజరవుతారు. సాయంత్రం 7 గంటలకు తుక్కుగూడ కార్నర్ మీటింగ్, అనంతరం శంషాబాద్ కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి.


