స్వతంత్ర వెబ్ డెస్క్: ఖమ్మం(Khammam) సభలో అమిత్ షా(Amit Shah) మాట్లాడుతూ… ‘‘కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయి. కాంగ్రెస్ సోనియా(Sonia) కుటుంబం కోసం, భారాస కల్వకుంట్ల కుటుంబం(Kalvakuntla family) కోసం చేస్తున్నాయి. భద్రాచలం(Bhadrachalam) దక్షిణ అయోధ్యగా పేరుగాంచింది. శ్రీరామనవమికి(Sri Ram Navami) పాలకులు వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కేసీఆర్ విస్మరించారు. కేసీఆర్ కారు భద్రాచలం వెళ్తుంది కానీ ఆలయం వరకు వెళ్లదు. కేసీఆర్ కారు స్టీరింగ్ ఎంఐఎం నేత ఒవైసీ చేతుల్లో ఉంది. కేసీఆర్ గారూ.. గుర్తు పెట్టుకోండి. ఇక మీ కారు భద్రాచలం వెళ్లాల్సిన అవసరం లేదు. త్వరలోనే భాజపా సీఎం భద్రాచలం వెళ్లి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఎంఐఎం చేతిలో స్టీరింగ్ ఉన్న కారు మనకు కావాలా? తెలంగాణ విమోచనకు పోరాడినా స్వాతంత్ర్య యోధులకు నివాళులర్పిస్తున్నా. హైదరాబాద్ విముక్తికి 75 ఏళ్లు నిండాయి. తెలంగాణ అమరవీరుల కలలను కేసీఆర్ కల్లలు చేశారు’’ అని అమిత్ షా విమర్శించారు.
కేసీఆర్ సర్కారు తిరోగమనం ప్రారంభమైందని.. త్వరలో తెలంగాణలో కమలం వికసిస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో భారాసకు తామే ప్రత్యామ్నాయం అంటూ చెప్పుకొస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు అనుగుణంగా సత్తా చాటేలా ఖమ్మం గడ్డ నుంచి శాసనసభ ఎన్నికలకు సమరశంఖం పూరించింది. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన ‘రైతు గోస- భాజపా భరోసా’ భారీ బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భాజపా ఫ్లెక్సీలు, హోర్డింగులు, కటౌట్లతో ఖమ్మం నగరం కాషాయమయంగా మారింది.