26.7 C
Hyderabad
Tuesday, April 23, 2024
spot_img

రేఖా ఝున్ ఝున్ వాలా మరో సంచలన నిర్ణయం

    భారతదేశంలో మూడో అత్యంత ధనవంతురాలైన మహిళ, బిజినెస్ క్వీన్ గాప్రసిద్ధి చెందిన రేఖా ఝున్ ఝున్ వాలా మరో సంచలనంతో వార్తలలోకి ఎక్కారు. ముంబై లోని తన అద్భుత నివాసం నుంచి  అరేబియా సముద్రం వీక్షిం చేందుకు అడ్డుగా ఉన్న 9 అపార్ట్ మెంట్ల భవనాలను కూల్చేసేందుకే కొనుగోలు చేయడం సంచలన వార్త అయింది.

    రేఖ ఝున్ ఝున్ వాలా పరిచయం అక్కరలేని ప్రఖ్యాత మహిళ. మనదేశంలోనే మూడో అత్యంత ధనవంతురాలు. ఫోర్బ్స్ కథనం ప్రకారం ఆమె ఆస్తుల విలువే.. 66 వేల కోట్ల రూపాయలు ఉంటుంది. స్టాక్  మార్కెట్ కింగ్ గా పేరొందిన రాకేష్ ఝున్ ఝున్ వాలా సతీమణి. 2022 లో రాకేష్ ఝున్ ఝున్ వాలా మరణం తరువాత, ఆమెకు వారసత్వంగా ఆస్తులన్నీ సంక్రమించాయి. దీంతో రేఖ భారతదేశపు సంపన్న మహిళల్లో ఒకరుగా నిలిచారు. తెలివిగా పెట్టుబడులు పెట్టి, సంపద ఇమ్మడి ముమ్మడిగా పెంచడంలో కూడా రాకేశ్ ఝున్ ఝున్ వాలా వారసత్వాన్ని అందుకున్న ఆమె ఇన్వెస్ట్ మెంట్ పోర్ట్ ఫోలియోలో అందవేసిన చేయి. రేఖ ఝున్ ఝున్ వాలా కు టాటా మోటార్స్, టైటాన్ సహా 29 కంపెనీల్లో హోల్డింగ్స్ ఉన్నాయి.

    ముంబై యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్ అయిన రేఖ 1987 లో రాకేష్ ఝున్ ఝున్ వాలా ను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు – నిష్ట, కవలలు ఆర్యమన్, ఆర్యవీర్ . రాకేష్ ఝున్ఝున్వాలా 2022 ఆగస్టు 14న కన్నుమూశారు. ఆయన మరణించే నాటికి ఆయన ఆస్తుల విలువ సుమారు రూ.41,వేల కోట్ల రూపాయలు. ఆ తర్వాత రేఖా ఝున్ ఝున్ వాలా తన వాణిజ్యపరమైన తెలివితేటలతో పెట్టుబడులు పెడుతూ ఆస్తులను ఇప్పుడు ఏకంగా 66 వేల కోట్ల రూపాయలకు పెంచారు. ముంబై శివారులోని మలబార్ హిల్స్ లో విలాసవంతమైన భవనం ఆమె నివాసం.. ఆ నివాసం నుంచి అరేబియా సముద్రాన్ని వీక్షిస్తూ.. ఎంజాయ్ చేయడం రేఖా ఝున్ ఝున్ వాలా హాబీ. అలా వీక్షించేం దుకు ఓ 9 అంతస్తుల అపార్ట్ మెంట్ అడ్డంకిగా ఉంది. అంతే ఆ అపార్ట్ మెంట్ ను తొలగించేద్దాం అనుకున్నారు. ఏకంగా 118 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ భవన సముదాయాన్ని కొనేశారు. విలాసవంతమైన ఆ అపార్ట్ మెంట్లను కొనుగోలు చేసేందుకు ఝున్ ఝున్ వాలా కుటుంబం స్టాంప్ డ్యూటీ రూపంలోనే రూ.9.02 కోట్లకు పైగా చెల్లించింది. 2023 నవంబర్ నుంచి రేఖ వివిధ డీలర్ల నుంచి 118 కోట్ల రూపాయలకు తొమ్మిది అపార్ట్మెంట్లను కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చెబుతున్నాయి. రేఖ ఝున్ ఝున్ వాలా గత నాలుగు నెలల్లో మూడు ఖరీదైన ప్రాపర్టీ డీల్స్ చేశారు.

   గతవారం జరిగిన మరో డీల్ లో ఝున్ ఝున్ వాలా వాల్కేశ్వర్ లో మరో 11.76 కోట్ల రూపాయల విలువైన అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేశారు 1,666 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాలో విస్తరించిన ఈ అపార్ట్మెంట్ అరేబియా సముద్రానికి సమీపంలో 50 ఏళ్లకు పైగా పురాతనమైన రాక్ సైడ్ అపార్ట్ మెంట్ లో ఉంది. దీనికోసం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుగా మరో 59 లక్షల రూపాయలు చెల్లించారు. 2023 నవంబర్ లో రేఖ ఝున్ ఝున్ వాలాకు చెందిన కిన్నెంటో ఎల్ ఎల్ పీ సంస్థ కోసం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో లక్షా 94వేల చదరపు అడుగుల కమర్షియల్ ఆఫీస్ స్థలాలను కొనుగోలు చేశారు. దీని ఖరీదు సుమారు 739 కోట్ల రూపాయలు. ఇలా బిజినెస్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న రేఖ నేడో రేపో అత్యంత ధనవంతురాళ్లలో నెంబర్ 1 కాగలరు.

Latest Articles

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

సీఎం ట్వీట్‌ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సోషల్‌ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్‌ చేసారు. ట్వీట్‌కు జతచేసిన వీడియోకు కాంగ్రెస్‌కు...కామ్రేడ్లకు కుదిరిన దోస్తీ అంటూ కామెంట్‌ చేసారు. భువనగిరి ఎంపీ అభ్యర్ధి కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేషన్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్