రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ దందా జోరుగా సాగుతోంది. చేవెళ్ల మండలం తంగడపల్లిలో అమాయకుల నుంచి తక్కువ ధరలతో భూములను కొట్టేసి, సర్కార్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామ పంచాయితీ పెద్దలు, కార్యదర్శి అండదండలతో మూడు పువ్వులు, ఆరు కాయలుగా వ్యాపారం సాగుతుండటంతో వీరి ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే, ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి రియల్ ఎస్టేట్ దందాను అడ్డుకుని అమాయకులను కాపాడాలని అక్కడి స్థానికులు కోరుకుంటున్నారు.