స్వతంత్ర వెబ్ డెస్క్: భారత నిఘా విభాగం ‘రా’ కొత్త అధిపతిగా రవి సిన్హా నియమితులయ్యారు. ఛత్తీస్‌గఢ్ క్యాడర్‌కు చెందిన రవి సిన్హా 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. రవి సిన్హా గత ఏడు సంవత్సరాలుగా ‘రా’లోనే ఆపరేషనల్ వింగ్ చీఫ్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. విదేశాల్లో గూఢచర్యం, నిఘా వ్యవహారాల్లో రవి సిన్హా మంచి దిట్ట అని పేరుంది. ‘రా’ నూతన అధిపతిగా రవి సిన్హా నియామకంపై కేంద్ర మంత్రుల కమిటీ ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం రా చీఫ్‌గా పని చేస్తున్న సమంత్ కుమార్ గోయెల్ పదవీకాలం జూన్ 30, 2023న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో రా అధిపతిగా సిన్హా బాధ్యతలు చేపట్టనున్నారు.ఇప్పటికే ఆయన పదవీకాలం పలుమార్లు పొడిగించారు. కాగా, భారత నిఘా విభాగంలో అత్యంత ప్రతిభావంతుల్లో ఒకరిగా రవి సిన్హాకు పేరుంది. ఆయన రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన రవి సిన్హా ప్రస్తుతం క్యాబినెట్ సెక్రెటేరియట్ స్పెషల్ సెక్రెటరీగా ఉన్నారు. సిన్హా గత ఏడేళ్లుగా ‘రా’ ఆపరేషనల్ విభాగంలో సేవలు అందిస్తున్నారు. కాగా విదేశాల్లో అత్యంత కీలకమైన నిఘా కార్యకలాపాలను ‘రా’ నిర్వహిస్తుంది.