స్వతంత్ర వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ప్రస్తుత రాజకీయ అంశాలపై తనదైన స్టైల్‌లో స్పందిస్తూ కౌంటర్‌లు ఇస్తూ వైరల్ అవుతున్నాడు రామ్ గోపాల్ వర్మ. ముఖ్యంగా వైసీపీ పార్టీను సమర్థిస్తూ ప్రతిపక్షాలపై కావాలనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈరోజు సాయంత్రం సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. చాలా రోజుల తర్వాత సీఎం జగన్‌తో ఆర్జీవి భేటీ అవ్వడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది. రామ్ గోపాల్ వర్మ గత కొన్నేళ్లుగా పొలిటికల్ బ్యాక్డ్రాప్‌లోనే సినిమాలు తీస్తున్నాడు. అలాగే ఆయన గత కొంత కాలంగా వైసీపీ పార్టీను సమర్థిస్తూ వస్తోన్న విషయం కూడా విదితమే. అందుకే ప్రతిపక్ష టీడీపీ, దాని మిత్రపక్షం జనసేనను ఓ రేంజ్ లో విమర్శిస్తున్నారు అనే టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ లైఫ్ స్టోరీ ను బేస్ చేసుకొని ఓ పొలిటికల్ డ్రామా సినిమాను తెరెక్కిస్తున్నారు. ప్రజల్లో వైఎస్ జగన్ పై సింపతీ వచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ మూవీతో పాటు ‘శపథం’ అనే సినిమాను కూడా జగన్ లైఫ్ స్టోరీను బేస్ చేసుకునే తీస్తున్నారట. ఇప్పటికే ఈ ‘వ్యూహం’ అనే సినిమాకు సంబంధించి కొన్ని లుక్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అందులోని పాత్రలు కూడా వైఎస్ జగన్, వైఎస్ భారతిలను పోల్చి ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ను ఆర్జీవి కలుస్తున్నారనే టాక్ నడుస్తోంది. మరి మూవీ కోసం చర్చించడానికి వెళ్లారా మరేదైనా విషయం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ‘వ్యూహం’ నేపథ్యంలో గతంలో కూడా ఆర్జీవీ.. జగన్‌ను కలిశారు.