తిరుమల శ్రీవారిని ప్రముఖ హీరో రామ్ చరణ్ దంపతులు దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవలో సతీ మణి ఉపాసన., కుమార్తె క్లీంకార తో కలసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనం తరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పుట్టిన రోజు సందర్భంగా నిన్న సాయంత్రమే కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో హైద రాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి రామ్ చరణ్ చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుమల వెళ్లారు. చరణ్ నేడు 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంకన్న సేవలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూతురు క్లీంకార జన్మించిన తర్వాత మొదటి సారి రామ్‌చరణ్ శ్రీవారిని దర్శించుకున్నారు.


