24.2 C
Hyderabad
Monday, November 3, 2025
spot_img

విజయ్ సినిమాలో రామ్ చరణ్ ప్రత్యేక అతిథి పాత్ర..

స్వతంత్ర వెబ్ డెస్క్: తమిళ సూపర్ స్టార్, ఇళయ దళపతి విజయ్ తో సంచలన దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ‘లియో’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఖైదీ, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకున్న కనకరాజ్, విజయ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై సహజంగానే భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు విజయ్ త్వరలోనే రాజకీయాల్లోకి వెళ్తాడన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. దీన్ని రెట్టింపు చేసేలా దర్శకుడు లోకేశ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో అతిథి పాత్ర చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య లోకేశ్, చరణ్ డిన్నర్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం క్లైమాక్స్ ఓ కీలక పాత్ర కోసం చెర్రీని ఒప్పించేందుకు డిన్నర్‌‌కు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. సినిమా క్లైమాక్స్‌ లో హీరో గురించి చెప్పే అతిథి పాత్రకు చరణ్ ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్