ఏపీలో ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన కోసం అభిప్రాయ సేకరణ చేపట్టనున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. టీడీపీ – జనసేన పార్టీలతో పొత్తు ఖరారవ్వడం సంతోషమని తెలిపారు. ఏయే సీటు.. ఎన్ని సీట్లు అనేది రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని పురందేశ్వరి అన్నారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రచార రథాలను పురందేశ్వరి ప్రారంభించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏం ఆశిస్తున్నారనే అంశంపై రెండు బాక్సులు ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. తొమ్మిది జిల్లాలకు మేనిఫెస్టో రథాలను పంపనున్నట్టు చెప్పారు. పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.