స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక ఎన్నికల ఫలితాలతో ఫుల్ జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో PFI సంస్థతో భజరంగ్ దళ్ ను పోలుస్తూ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ ఫౌండర్ హితేష్ భరద్వాజ్ పంజాబ్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన న్యాయస్థానం తాజాగా సమన్లు జారీ చేస్తూ జూలై 10న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. కాగా కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కూడా భజరంగ్ దళ్ నిషేధిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీంతో హిందూ సంఘాలతో పాటు బీజేపీ భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టాయి.