23.2 C
Hyderabad
Thursday, February 19, 2026
spot_img

సిట్ విచారణకు హాజరైన పులివర్తి నాని

     పోలింగ్ సందర్భంగా జరిగిన ఏపీలో చోటు చేసుకున్న హంసాత్మక ఘటనలపై సిట్ విచారణ కొనసా గుతోంది. చంద్రగిరి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సిట్ విచారణకు హాజరయ్యా రు. సిట్ సభ్యుల్లో ఒకరైన డీఎస్పీ రవి మనోహరాచారి తిరుపతి ఎస్వీయూ పోలీస్ స్టేషన్ లో విచారణ చేపట్టారు. ఈ విచారణకు పులివర్తి నాని వీల్ చెయిర్లో హాజరయ్యారు.

ఏపీలో మే 13వ తేదీన పోలింగ్ జరగ్గా, ఆ తర్వాత రోజు తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. అదే సమయంలో పల్నాడులో, అనంతపురం జిల్లాలోనూ పలు హింసాత్మక ఘటనలు జరిగాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం సిట్ ను నియమించింది. సిట్ సభ్యుల్లో ఒకరైన డీఎస్పీ రవి మనోహరాచారి తిరుపతి ఎస్వీయూ పోలీస్ స్టేషన్ లో విచారణ చేపట్టారు. ఈ విచారణకు పులివర్తి నాని వీల్ చెయిర్లో హాజర య్యారు. వైసీపీ శ్రేణుల దాడిలో ఆయనకు బలమైన దెబ్బలు తగిలాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన పులివర్తి నాని, ఇంటివద్దే చికిత్స పొందుతున్నారు. సిట్ ఎదుటకు వీల్ చెయిర్లో వచ్చిన పులవర్తి, మే 14న ఏం జరిగిందో వివరించారు. ఆ రోజు తనపై జరిగిన దాడి వెనుక ఉన్నది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని స్పష్టం చేశారు. కుట్రతోనే చెవిరెడ్డి ఈ దాడికి పాల్పడినట్టు ఆరోపించారు. పోలీసులకు అన్ని ఆధారాలు సమర్పించామని, న్యాయం చేయాలని కోరామని పులివర్తి నాని వెల్లడించారు. తనకు, తన కుటుంబానికి పోలీసు భద్రత మరింత పెంచాలి అని సిట్ అధికారి రవి మనోహర్ ని అభ్యర్థించారు. రీపోలింగ్ కు వెళ్ళాల్సిన అవసరం లేదని తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్