MLA Bhupal Reddy | నల్గొండ జిల్లా బైపాస్ వద్ద అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కంటే ముందే అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎస్పీ అపూర్వ రావు. దీంతో ఎస్పీ తీరుపై ఎమ్మెల్యే అభ్యంతరం తెలిపారు. నేను రాకుండా ఎస్పీ ఎలా పూలమాల వేస్తారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ప్రోటోకాల్ కూడా తెలియదా అంటూ మండిపడ్డారు. కాసేపు ఎమ్మెల్యే కంచర్ల పూలమాల వేయడానికి నిరాకరించాడు. అధికారులు సద్ది చెప్పడంతో ఎమ్మెల్యే నెమ్మదించాడు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దీంతో వివాదం సద్దుమణిగినట్లైంది.