22.7 C
Hyderabad
Tuesday, December 3, 2024
spot_img

ప్రచారపర్వంలో BRS అభ్యర్థులకు నిరసన సెగలు

హ్యాట్రిక్‌పై గురిపెట్టిన బీఆర్ఎస్.. ఆ దిశగా ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తోంది. అయితే.. కొన్నిచోట్ల ఆ పార్టీ అభ్యర్థులకు చుక్కెదురవుతోంది. నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించే సమయంలో ఎక్కడికక్కడ స్థానికులు అడ్డుకుంటున్నారు. ఆయా పథకాలు సంగతేంటి.. వాటి అమలులో తమకు జరిగిన అన్యాయాన్ని ఎందుకు చక్కదిద్ద లేదంటూ ఫైరవుతున్నారు. ఇదే ఇప్పుడు ఆయా అభ్యర్థుల్లో టెన్షన్ పుట్టిస్తోంది.

నామినేషన్ల ఘట్టం పూర్తికావడం, దీనికితోడు పండుగలు అయిపోవడంతో అభ్యర్థులంతా ప్రచారంపైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. ఉదయం 8 నుంచే ప్రచారం నిర్వహిస్తూ తమకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు అన్ని పార్టీల అభ్యర్థులు. అయితే..ఈ విషయంలో బీఆర్ఎస్‌కు చెందిన కొందరు అభ్యర్థులకు మాత్రం చుక్కెదురవుతోంది. గ్రామాల్లోకి రానివ్వకుండా కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని అడ్డుకుంటున్నారు స్థానికులు. ఈ క్రమంలోనే అసంతృప్తితో వెనుదిరిగారు ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి గొంగడి సునీత. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఆత్మకూరు మండలంలోని రాయిపల్లి, సర్వేపల్లి, తిమ్మాపురం గ్రామాల్లో ప్రచారం ముగించుకొని మొరిపిరాల గ్రామంలోకి వెళ్లగా అక్కడ నిరసనకారులు అడ్డుకున్నారు. దళితబంధులో తమకు అన్యాయం చేశారని నిలదీశారు గ్రామస్థులు.

స్థానికంగా ఉన్న సర్పంచ్.. దళిత బంధు లబ్దిదారులు ఒక్కొక్కరి నుంచి మూడు లక్షల రూపాయలు వసూలు చేశారని..పేరుకు తమను ఎంపిక చేసినా తీవ్ర అన్యాయం జరిగిందంటూ నిలదీశారు. దీంతో స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులకు, గ్రామస్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు అక్కడ ప్రచారం పెద్దగా నిర్వహించకుండానే వెనుదిరిగారు గొంగడి సునీత. యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగాంలోనూ గొంగడి సునీతకు ఇదే పరిస్థితి తలెత్తింది. బస్వాపూర్ రిజర్వాయర్ కాలువలో భూమి కోల్పోయిన నిర్వాసితులు నిరసన తెలిపారు. దీంతో ఆమె తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేశారు. ఓ దశలో గ్రామస్థుల నినాదాలతో వారిపై అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే అభ్యర్థి గొంగడి సునీత.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ బీఆర్ఎస్ అభ్యర్థికి ఇదే పరిస్థితి ఎదురైంది. సిర్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్పను భీమని మండలం చిన్న గుడిపేట గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామానికి కనీసం రోడ్డు కూడా వేయించలేదని ఫైరయ్యారు. ఇంత చేసీ మళ్లీ ఓట్ల కోసం గ్రామానికి ఎలా వచ్చారంటూ ఆగ్రహించారు. ఈ సంద్భంగా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో ప్రచారం నిర్వహించకుండానే వెనుదిరిగారు కోనప్ప.

మరోవైపు..జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డికి సైతం చుక్కెదురైంది. వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో ఆయన ప్రచారం నిర్వహిస్తున్న వేళ విద్యార్థులు నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఉద్యోగాలు రావడం లేదని మండిపడ్డారు. విద్యార్థిలోకాన్ని సీఎం పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. అయితే..చివరకు పోలీసులు నచ్చచెప్పడంతో నిరసన విరమించారు విద్యార్థులు.

ఓవైపు పోలింగ్ తేదీకి గడువు సమీపిస్తుండడంతో ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఇలాంటి సమయంలో నిరసన సెగలు ఎదురవుతుండడంతో బీఆర్ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధుల్లో టెన్షన్ కన్పిస్తోంది. రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనన్న గుబులు నెలకొంది.

Latest Articles

పార్టీ బలోపేతంపై నేతలతో చర్చించనున్న జగన్‌

పార్టీ బలోపేతంతోపాటు కూటమి ప్రభుత్వంపై ప్రజా పోరాటం విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై చర్చించనుంది వైసీపీ. పార్టీ అధినేత వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రేపు రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. తాడేపల్లిలో జరగనున్న సమావేశంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్