ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత దిల్ రాజు(Dil Raju) దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయానికి చేరుకున్న ఆయనను టీటీడీ అధికారులు పూర్ణకుంభంతో ఆహ్వానించారు. అనంతరం స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి మొక్కులు చెల్లించుకున్నాక.. వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ఏఫ్రిల్ 14వ తేదిన శాకుంతలం సినిమా విడుదలవుతుందని అన్నారు. త్వరలోనే హీరో రామ్ చరణ్, శంకర్ మూవీ విడుదలవుతుందని తెలిపారు. అలాగే తమిళంలో కొత్త ప్రాజెక్ట్ ని త్వరలోనే ప్రకటిస్తామని దిల్ రాజు అన్నారు.
Read Also: బిల్లు ఆమోదం పొందకుంటే.. దీక్ష విరమించేది లేదు: కవిత
Follow us on: Youtube Instagram