33 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

పేరెంట్స్‌ విడాకులు తీసుకుంటే పిల్లల్లో వచ్చే అతి పెద్ద సమస్య ఇదే..

దంపతుల మధ్య వివాదం రావడం సర్వసాధారణం విషయం . అయితే ఒకప్పుడు ఆ వివాదాలు జరిగిన కొన్నాళ్లకు ఎవరో ఒకరు సర్దుకుని మళ్లీ కలిసి పోయేవారు. కానీ నేటి తరం జంటలు మాత్రం వివాదం వస్తే సర్దుబాటుకు నో చెబుతున్నారు. ఒకరిని ఒకరు శత్రువులుగా చూసుకొని , విడాకులకు దరఖాస్తు చేసుకుని.. తమ బంధాన్ని ముక్కలు చేసుకుంటున్నారు. నచ్చిన వైపుకు కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నారు . అయితే ఈ నిర్ణయం వల్ల ఆ జంట జీవితమే కాదు వారి పిల్లల జీవితం కూడా పూర్తిగా మారిపోతోంది.

నిజానికి భార్యాభర్తలు క్షణికావేశంలో గొడవలు పడుతారు కానీ.. తర్వాత పిల్లల కోసం ఆలోచించి సర్దుకుపోతారు. కానీ మరికొంతమంది దంపతులు మాత్రం సర్దుకుపోవాల్సింది పోయి.. ఏకంగా కోర్టు మెట్లు ఎక్కుతారు. తల్లిదండ్రులు అలా చేయడం వల్ల పిల్లలు సఫర్ అవుతారన్న విషయం తెలిసిందే. అయితే పిల్లల వయస్సు పెరిగే కొద్ది వారు అర్థం చేసుకుంటారనీ , అన్నీ మరచిపోయి కొత్త జీవితాలు ప్రారంభిస్తారని భావిస్తాం కానీ అదినిజం కానే కాదు.

ఆర్థిక స్వాతంత్య్రం, మారుతున్న సామాజిక పరిస్థితులు, తానే గొప్ప అనే ధోరణులు ఇలా విడిపోవడానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య మొదట మమ్ములుగా అనిపించిన అభిప్రాయ బేధాలు పెరిగి పెరిగి విభేదాలుగా మారి తర్వాతి కాలంలో గొడవలకు దారి తీస్తున్నాయి. సర్దుబాటు చేసుకోలేని క్రమంలో గొడవలు పెరిగి పోలీసు కేసులు, కోర్టులు చివరకు విడాకులతో పరిసమాప్తి అవుతోంది. భార్యభర్తలిద్దరు ఉద్యోగాలు చేస్తుంటే కుటుంబ బాధ్యతలు పంపకం, ఇంటి పనులు, పిల్లల పెంపకం వంటి విషయాల్లో గొడవలు వస్తున్నాయి. మరికొందరు కంప్యూటర్లు, సెల్‌ఫోన్లలో మునిగిపోతూ కుటుంబ జీవితానికి దూరమవుతున్నారు.

గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు జరిగేవి. కాలానుగుణంగా ఈ పరిస్థితిలో మార్పులు వచ్చాయి. ఉమ్మడి కుటుంబాల స్థానంలో చిన్న కుటుంబాలు వచ్చాయి. అప్పట్లో భార్యాభర్తల మధ్య ఏవైనా విభేదాలు వస్తే ఇంటిపెద్ద పరిష్కరించే వారు. ఇద్దరి తరపు పెద్దవారు కూర్చుని 4 గోడల మధ్యే వారి మధ్య అంతరాన్ని తొలగించేవారు.కానీ ఇప్పుడు తల్లిదండ్రు ర్ల జోక్యం ఎవరికీ నచ్చడం లేదు. అలా అని సొంతంగా ఆలోచించడం కూడా జరగటం లేదు. తప్పు ఎదుటివారిది మాత్రమే అన్న ధోరణిలో ఉన్నప్పుడు ఎంతమంది బుద్ధులు చెప్పినా ఉపయోగం ఉండటం లేదు.

విడాకులకు 7రకాల కారణాలు కామన్‌గా కనిపిస్తున్నాయి. ఆర్థిక సమస్యలు, వివాహేతర సంబంధాలతో మోసం, ప్రేమ లేకపోవడం, అత్యాశ, ఇష్టం లేని పెళ్లి, శారీరక సాన్నిహిత్యం లేకపోవడం, మానసిక సాన్నిహిత్య లోపం. నిజానికి ఇద్దరు మనుషులు మానసికంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఒకే ఇంట్లో నివసించినా అందులో జీవం ఉండదు. ఫలితంగా కాలం గడిచే కొద్దీ ఆ బంధం బీటలు వారిపోతుంది. అయితే తల్లిదండ్రులు విడిపోయారన్న ఆలోచన పిల్లల్లో ఒక రకమైన అభద్రతా భావానికి, ఆత్మన్యూనతకు దారితీస్తుంది. ఇది వారి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేకుంటే కొంతమంది పిల్లలు డిప్రెషన్‌కు గురవుతారు. వ్యసనాలకు బానిస అవుతారు. వారిలో మానసిక వేదన పెరుగుతుంది. తమ అభిప్రాయాలను తల్లి దండ్రులతో చెప్పుకోలేని పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. కనపడని ఆందోళన పెరిగి అది పక్షవాతానికి దారి తీస్తుంది. డిప్రెషన్, డయాబెటిస్‌కు సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. సాధారణంగా పేరెంట్స్‌ విడిపోతే అది వారి పిల్లల భవిష్యత్తుపై ప్రభావంచూపిస్తుంది అని తెలిసిందే. అయితే దీని వల్ల పిల్లలకు భవిష్యత్తులో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధనలో భాగంగా 65 ఏళ్లకు పైబడిన 13,000 మందిని పరిగణలోకి తీసుకుని విశ్లేషించారు. విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలకు బ్రెయిన్‌ స్ట్రోక్ బారిన పడే అవకాశం 60 శాతం ఎక్కువగా ఉందట.

చిన్నతనంలో శారీరకంగా లేదా మానసికంగా వేధింపులకు గురైన పిల్లలు, అలాగే విడాకులు తీసుకున్న కుటుంబాల్లో పెరిగిన వారు వివిధ ఆరోగ్య సమస్యతో బాధపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మెదడుకు రక్త సరఫరా ఆగిపోవడాన్ని బ్రెయిన్‌ స్ట్రోక్‌గా చెబుతుంటారు. రక్తనాళం చిట్లడం లేదా మెదడుకు సరైన రక్తప్రవాహం ఉండకపోవడం ప్రధాన కారణం. ఇందులో మెదడు భాగాలు దెబ్బతింటాయి, ఇవి శాశ్వతంగా మెదడుకు నష్టం చేకూర్చుతాయి. కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక వైకల్యాన్ని లేదా మరణానికి దారి తీస్తాయని అంటున్నారు. అయితే తల్లిదండ్రుల విడాకుల కారణంగా బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు స్త్రీలలో, పురుషుల్లో ఒకేలా ఉండదు. అంతే కాదు పిల్లలకు తల్లి దండ్రులు విడిపోయారు అనే బాధ వల్ల మానసిక ఆందోళన, ఒత్తిడి ఎక్కువై మాదకద్రవ్యాలు, ధూమపానం వంటి వ్యసనాలకు అలవాటు పడడం కూడా బ్రెయిన్‌ స్ట్రోక్‌కు కారణమవుతుందట.

స్ట్రోక్ వచ్చినప్పుడు ముఖం, చేయి లేదా కాలు ఆకస్మికంగా తిమ్మిరి లేదా బలహీనత, ఆకస్మిక గందరగోళం, మాట్లాడటం లేదా అర్థం చేసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. నడవలేకపోవడం, తల తిరగడం, విపరీతమైన తలనొప్పి, ఒకటి లేదా రెండు కళ్లలో చూపు కోల్పోవడం, ఒక చేయి బలహీనంగా లేదా తిమ్మిరిగా అనిపించడం, మాటలు మందగించడం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటన్నిటితో పాటు అనేకమందిలో గుండెపోటు సమస్య ఎక్కువగా వచ్చినట్టు పరిశోధకులు వెల్లడించారు. కాబట్టి .. మీరు విడాకులు తీసుకుంటే ఆ ప్రభావం భవిష్యత్తులో మీ పిల్లలపై ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జాగ్రత మరి.

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్