కాసేపట్లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ వయనాడ్ నుంచి నామినేషన్ వేయనుంది. కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ఖర్గేతోపాటు పలువురు హాజరుకానున్నారు. నామినేషన్‌కు ముందు కల్పేటర్‌లో భారీ రోడ్‌షో నిర్వహించనున్నారు. రాహుల్‌గాంధీ రాజీనామాతో వయనాడ్‌లో ఉప ఎన్నిక జరుగుతోంది. దీంతో వయనాడ్‌ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తొలిసారి బరిలోకి దిగారు ప్రియాంక గాంధీ.
గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ తో పాటు.. యూపీలోని రాయబరేలి నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఎంపీగా గెలిచారు. దీంతో కేరళలోని వయనాడ్ సీటుకు రాజీనామా చేసి రాయబరేలి ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన రాజీనామాతో వయనాడ్‌లో ఉప ఎన్నికల అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన ప్రియాంకగాంధీ కాసేపట్లో ఎంపీగా నామినేషన్ వేయనున్నారు. అంతకంటే ముందుగా కల్పేట కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక గాంధీ రోడ్డు షో నిర్వహించనున్నారు. నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా పాల్గొననున్నారు. ఈమేరకు ఇప్పటికే వయనాడ్ చేరుకున్నారు.
ఇకపోతే 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ 4.60 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో 3.54 లక్షల ఓట్ల మార్జిన్‌తో ఎంపీగా విజయం సాధించారు. దీంతో ప్రస్తుతం జరిగే ఉప ఎన్నికల్లో ఈసారి ప్రియాంకాగాంధీ ఐదు లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది హస్తం పార్టీ. అయితే,.. ప్రియాంకాగాంధీని ఢీకొట్టేందుకు కోజికోడ్ మున్సిపల్ మహిళా కార్పొరేటర్ నవ్య హరిదాస్ పోటీ పడుతోంది. ప్రజాప్రతినిధిగా ప్రియాంకగాంధీ కంటే తనకే అనుభవం ఎక్కువగా ఉందని.. తానే గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేస్తోంది నవ్య.