సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని ముందుకు రావడం ప్రశసంనీయమని జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్యా మిశ్రా తెలిపారు. హైదరాబాద్ చంచల్ గూడ జైలు ఆవరణలో వార్డర్ల శిక్షణ కార్యక్రమాన్ని మిశ్రా ప్రారంభించారు. ప్రభుత్వ పోటీ పరీక్షలో నిలిచి, గెలిచిన వార్డర్లకు ఆమె అభినందనలు తెలిపారు. ఎంతో పేరు ప్రతిష్ఠలున్న తెలంగాణ జైళ్ల శాఖకు మరింత పేరు తీసుకురావాలని ఆమె కోరారు.
హైదరాబాద్ చంచల్ గూడా జైలు ఆవరణలో వార్డర్లకి శిక్షణ కార్యక్రమాన్ని జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్యా మిశ్రా ప్రారంభించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో వార్డర్లుగా 136 మంది ఎంపికయ్యారు. వీరిలో 85 మంది జైళ్ళ శాఖ ప్రధాన కార్యాలయానికి రిపోర్టు చేసారు. వీరిలో ఏడు గురు మహిళా జైలు వార్డర్లు వున్నారు. వార్డర్లగా ఎంపికైన వారికి ఇటీవలే నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేసారు.దేశంలో తెలంగాణ జైళ్ళ శాఖకు ఎంతో మంచిపేరు ఉందని డాక్టర్ సౌమ్యా మిశ్రా చెప్పారు. ఆ పేరును మరింత పెంపొందించడానికి కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వార్డర్లందరూ భాగ స్వాములు కావాలని తెలిపారు. ఎంపికైనా వార్డర్లందరికీ ఉత్తమ శిక్షణ ఇచ్చి వజ్రాల్లా తీర్చిదిద్దు తామని ఆమె చెప్పారు. నేరస్థులుగా జైళ్ళకు వచ్చే ఖైదీలను మంచి పౌరులుగా తీర్చిదిద్ది సమాజం లోకి పంపిస్తా మని తెలిపారు. ఖైదీలతో అధికంగా గడిపేది వార్డర్లే అని, అందుకే వారు ఖైదీలతో ఎలా స్నేహ పూర్వంగా ఉండాలో తెలియజేస్తామని, అధికారం, దర్పం చూపడం, అమానుషంగా ప్రవర్తించడం తగదని శిక్షణ ఇస్తామని ఆమె చెప్పారు. ఇప్పటికే రెండు బ్యాచ్ ల వార్డర్ల శిక్షణ పూర్తయ్యిందని, ఇప్పుడు మూడో బ్యాచ్ శిక్షణకు వచ్చిందని డాక్టర్ సౌమ్యా మిశ్రా చెప్పారు. ఈ శిక్షణ వార్డర్లకు పూర్తిస్థాయిలో ఉపకరిస్తుందని భావిస్తున్నామని ఆమె తెలిపారు.


