ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయల్దేరారు. రెండు రోజుల పాటు మోదీ పోలాండ్‌లో పర్యటించబోతున్నారు. భారత్, పోలాండ్ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ పోలాండ్‌లో పర్యటించబోతున్నారు. ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలు బలపడటమే లక్ష్యంగా ప్రధాని పోలాండ్ పర్యటన సాగనుంది. అనంతరం అక్కడి నుంచి ఉక్రెయిన్ బయల్దేరి వెళ్లతారు. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆహ్వానం మేరకు తాను ఉక్రెయిన్‌లో పర్యటించబోతున్నట్లు ఎక్స్ వేదికగా మోదీ తెలిపారు. ఉక్రెయిన్‌లో శాంతి, స్థిరత్వం త్వరగా తిరిగి రావాలని ఆశిస్తున్నట్లు మోదీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి ముగింపు పలకాలని మోదీ ఆకాంక్షించారు.