ప్రధాని నరేంద్ర మోడీ ‘గేమింగ్ ఇంటరాక్షన్’ నిర్వహించారు. మనదేశంలో అగ్రశ్రేణి గేమర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. వాళ్లు రూపొందించిన వీడియో గేమ్ ల వివరాలు తెలుసుకున్నారు. వారు అందించిన టిప్స్ పట్టుకుని ప్రధాని విఆర్ ఆధారిత గేమ్స్, మొబైల్ గేమ్ అలాగే పిసి- కన్సోల్ గేమ్స్ ఆడే ప్రయత్నం చేశారు. గేమ్స్ ను చాలా ఎంజాయ్ చేస్తూ కన్పించారు. సృజనాత్మకతను ప్రోత్సహించడంలో తనకు తానే సాటి అని ప్రధాని మరో సారి నిరూపించారు.
గేమింగ్ పరిశ్రమలో కొత్త పరిణామాలు, భారతదేశంలో గేమింగ్ పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహం గురించి ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. మనదేశంలో గేమింగ్ ఇండస్ట్రీ ని మోదీ సర్కార్ గుర్తించింది. గేమర్లలో సృజనాత్మక తను మరింత ప్రోత్సహించేందుకు గత అవకాశాలను చర్చించారు. భారతీయ పురాణాల చుట్టూ ఆటలు ఎలా పెరిగా యో ఒక గేమర్ ఎత్తి చూపగా, మరొకరు ప్రభుత్వం వారి సృజనాత్మకతను ఎలా గుర్తించడం ప్రారంభించిందో పేర్కొన్నా రు.గేమింగ్ పరిశ్రమలో మహిళల భాగస్వామ్యం గురించి కూడా చర్చించారు. గేమింగ్ పరిశ్రమలో ఎక్కువ మంది అమ్మాయిలు భాగస్వా ములు కావాలా, వారు ఈ రంగంపై మరింత ఆసక్తి చూపాలా అని ప్రధాని ఒక గేమర్ ను ప్రశ్నిం చారు. గేమింగ్ ను జూదంతో సరిపోల్చి చూసినప్పుడు ఎలాంటి సందిగ్ధతను గేమర్లు ఎదుర్కొన్నారని ఆయన తెలుసుకునే ప్రయత్నం చేశారు. రియల్ మనీ గేమ్స్, స్కిల్ బేస్డ్ గేమ్స్ మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉండాల్సిన సమయం ఆసన్నమైందని ఓ గేమర్ బదులిచ్చాడు. ప్రధానిని కలిసిన గేమర్స్ లో తీర్థి మెహతా, పాయల్ ధారే, అనిమేశ్ అగర్వాల్ , అను బిష్త్ ,నమన్ మాథుర్, మిథిలేశ్ పటాన్కర్, గణేశ్ గంగాధర్ ఉన్నారు.


