28.8 C
Hyderabad
Tuesday, July 8, 2025
spot_img

‘ఈగల్’ మ్యూజిక్ డైరెక్టర్ దేవ్‌జాంద్‌పై ప్రశంసలు

మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన ‘ఈగల్’ సినిమా ఈ నెల 9న థియేటర్లలో విడుదలై మిక్డ్స్ టాక్‌తో రన్ అవుతోంది. సినిమా చూసినవాళ్లంతా డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని టేకింగ్‌తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ దేవ్‌జాంద్ గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయని మెచ్చుకుంటున్నారు. దేవ్‌జాంద్ కంపోజ్ చేసిన బీజీఎం వల్ల యాక్షన్ బ్లాక్స్ బాగా ఎలివేట్ అయ్యాయని అంటున్నారు.

దేవ్ జాంద్ ఈ చిత్రానికి చాలా కష్టపడి కొత్త సౌండ్ ఇచ్చాడు. సంగీత దర్శకుడిగా తొలిచిత్రమే మాస్ మహారాజా రవితేజ లాంటి స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరో సినిమాకు పనిచేయడం తన అదృష్టమని దేవ్ జాంద్ చెప్పుకొచ్చాడు. దేవ్‌జాంద్ అసలు పేరు డేవిడ్ సందీప్. టెన్త్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌లోనే క్రియేటివ్‌‌‌‌‌‌‌‌గా ఆలోచించి దేవ్ జాంద్ అని పెట్టుకున్నాడు. ఫ్రీలాన్స్ మ్యూజిషియన్‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేసే దేవ్ జాంద్.. హీరో శ్రీవిష్ణు క్లాస్ మేట్స్. అతని ద్వారానే దర్శకుడు కార్తీక్‌‌‌‌‌‌‌‌ను కలిసి ట్యూన్స్‌‌‌‌‌‌‌‌ వినిపించాడు. కార్తిక్ రాసుకున్న ప్రతి స్క్రిప్ట్‌కు తన ముందే మ్యూజిక్ కంపోజ్ చేసి ఇచ్చేవాడు. అలా రవితేజ సినిమాకు పని చేసే ఆఫర్ వచ్చింది. పెద్ద హీరో సినిమాకు అవకాశం రావడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చాలా కొత్త తరహా సంగీతం ఇవ్వడానికి ప్రయత్నించాడు. అందులో భాగంగానే ‘ఈగల్ ఆన్ హిస్ వే’ అనే కంప్లీట్ ఇంగ్లీష్ ట్రాక్ ఇచ్చాడు. రవితేజ సినిమాల్లో ఇదే ఫస్ట్ ఇంగ్లీష్ ట్రాక్. ఇక ‘ఆడు మచ్చా’ పాట మాస్‌‌‌‌‌‌‌‌ని మెస్మరైజ్ చేసేలా ఉంది. ‘గల్లంతు’ పాట మనసుని హత్తుకునే మెలోడీ. పాటలే కాకుండా బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ స్కోరు కూడా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో రవితేజ కూడా ఇంప్రెస్ అయి దేవ్‌జాంద్ పనితనాన్ని ప్రశంసించారు.

ఇక నిన్న జరిగిన ఈగల్ సక్సెస్ మీట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా దేవ్‌జాంద్ పనితనాన్ని మెచ్చుకున్నారు. ‘‘సినిమా రిలీజ్‌కు ముందు నుండి రవితేజగారు ముగ్గురు గురించి చాలా బాగా చెబుతుండేవారు. అందులో డైలాగ్ రైటర్ మణిబాబు ఒకరు. నిజంగానే అతను చాలా మంచి డైలాగ్స్ రాశారు. ఆ తర్వాత దేవ్‌ జాంద్. ఆయన పేరును పలకడం కోసం ఎంత ప్రాక్టీస్ చేశానంటే.. నేను చదువుకునే రోజుల్లో కూడా అంత ప్రాక్టీస్ చేయలేదు. ఆయన పేరులోనే మ్యూజిక్ ఉంది. అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారు.’’ అంటూ దేవ్ జాంద్ గురించి హరీష్ శంకర్ మాట్లాడారు.

మొత్తంగా ‘ఈగల్’ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఇటు డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని పనితనం గురించి, అటు మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ జాంద్ వర్క్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నక్కిన త్రినాధరావు నిర్మిస్తున్న ‘చౌర్య పాఠం’ సినిమాకు కూడా సంగీతం అందించే అవకాశం దేవ్ జాంద్‌కు దక్కింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్