స్వతంత్ర వెబ్ డెస్క్: లోక్‌సభలో(Lok Sabha) ప్రసంగం సమయంలో తను ప్రస్తావించిన ‘భరత మాత’మాటను తొలగించారంటూ రాహుల్ గాంధీ(Rahul Gandhi) వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి( Minister Prahlad Joshi) స్పందించారు. రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయన మతి తప్పినట్లుగా అనిపిస్తోందని జోషి వ్యాఖ్యానించారు. అన్ పార్లమెంటరీ మాటలను తొలగించామేతప్ప, భరతమాత అనే మాటను కాదని చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. మణిపూర్‌పై మేము(కేంద్రం) చర్చకు అంగీకరిస్తామని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కలలో కూడా అనుకోని ఉండరు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi,), కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit) చెప్పినట్లుగా, ఈ అంశంపై మనం సున్నితంగా వ్యవహరించాలి.
ఈ రోజు రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు వింటుంటే ఆయన తన మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారని అనిపిస్తోంది. రాహుల్ గాంధీ సభకు రాలేదు. మా సమాధానం వినలేదు.గ్రాండ్ ఓల్డ్ అని పిలవబడే పార్టీ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం చాలా దురదృష్టకరం’ అనిపేర్కొన్నారు. మరో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఏదో హడావుడి చేయాలన్న రాహుల్ గాంధీ ప్రయత్నం మరోసారి ఫెయిల్, ఫ్లాప్ అయ్యిందంటూ ఎద్దేవా చేశారు. ‘రాహుల్ తప్పుడు భాషను వాడుతున్నారు. భరత మాత బిడ్డ ఎవరూ కూడా ఆమె హత్య గురించి మాట్లాడరు, ఆలోచించరు. దేశానికి అప్రతిష్ట తెచ్చేందుకే ఇలా మాట్లాడుతున్నారన్న విషయం రాహుల్ వాడిన భాషను చూస్తే స్పష్టంగా తెలుస్తుంది’అని ఆరోపించారు.