34.7 C
Hyderabad
Saturday, May 17, 2025
spot_img

ప్రభాస్, ప్రశాంత్ వర్మ కాంబో ఫిక్స్ అయ్యిందా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్నట్టుగా ఎక్కవు సినిమాలను వేరే ఏ హీరో చేయడం లేదు. ఒకేసారి ఒకటి కాదు రెండు కాదు.. మూడు సినిమాలను కూడా సెట్స్ పైకి తీసుకొస్తుంటాడు. ప్రస్తుతం ది రాజాసాబ్, ఫౌజీ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. స్పిరిట్ సెట్స్ పైకి వచ్చేందుకు రెడీగా ఉంది. కల్కి 2, సలార్ 2 వెయిటింగ్ లో ఉన్నాయి. అయితే.. ఇప్పుడు ప్రభాస్, ప్రశాంత్ వర్మతో సినిమాకి ఓకే చెప్పారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. మరి.. నిజంగానే ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యిందా..? ఈ ప్రాజెక్ట్ వెనక ఏం జరిగింది..?

హ‌నుమాన్‌ మూవీ ఓ సంచలనం. చిన్న సినిమాగా రిలీజైంది.. బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది. దీంతో ప్రశాంత్ వర్మ పేరు మారుమ్రోగింది. టాలీవుడ్ హీరోలే కాదు.. బాలీవుడ్ హీరోలు సైతం ప్రశాంత్ వర్మతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌ వీర్ సింగ్ ప్రశాంత్ వర్మ ఓ క‌థ చెప్పాడు. అదే బ్ర‌హ్మ‌రాక్ష‌స్‌. ఈ మూవీ కోసం ప్రశాంత్ వర్మ.. ర‌ణ్‌వీర్ సింగ్ తో ఫోటో షూట్ కూడా చేశాడు. త్వరలోనే ఈ మూవీని అనౌన్స్ చేస్తారనుకుంటే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆతర్వాత బాలయ్య వారసుడు మోక్ష‌జ్ఞ‌తో ప్రశాంత్ వర్మ సినిమాను అనౌన్స్ చేశారు. అయితే.. అది కూడా సెట్స్ పైకి రాలేదు. ఇప్పుడు రణ్‌ వీర్ సింగ్ తో అనుకున్న బ్రహ్మరాక్షస్ సినిమాను ప్రభాస్ తో చేయనున్నాని తెలిసింది.

ప్ర‌భాస్‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ ఓ సినిమా చేస్తాడ‌ని ఎప్పటి నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు అదే నిజ‌మైందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ కథ చెప్పినప్పటి నుంచి.. బ్ర‌హ్మ‌రాక్ష‌స్ సినిమా చేయ‌డానికి ప్ర‌భాస్ ఉత్సాహం చూపిస్తున్నాడ‌ని, ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోయింద‌ని టాక్ బలంగా వినిపిస్తోంది. ప్ర‌భాస్ పై లుక్ టెస్ట్ కూడా చేయ‌బోతున్నారు. అందుకు ఏర్పాట్లు కూడా సిద్ధం అవుతున్నాయి. అయితే.. ప్రభాస్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఫుల్ బిజీగా ఉన్నాడు. సలార్ 2, కల్కి 2 ఎప్పుడు సెట్స్ పైకి వస్తాయో క్లారిటీ లేదు. ఇలాంటి టైమ్ లో మరో సినిమాకి ఓకే చెప్పడంతో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు..? ఎప్పుడు పూర్తి చేస్తారు..? అనేది క్లారిటీ రావాల్సివుంది. మరి.. ఏం జరగనుందో చూడాలి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్