కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కలచివేస్తోంది. సహాయక చర్యల కోసం పలువురు సినీతారలు ముందుకొచ్చి ఆపన్న హస్తం అందిస్తున్నారు. తాజాగా కష్టాల్లో ఉన్నవారికి చేయూత అందించడానికి ముందుకొచ్చారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. వయనాడ్‌కు భారీ విరాళాన్ని ప్రకటించారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రభాస్ రూ.2 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై సినీ ప్రియులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
టాలీవుడ్ నుంచి అంత మొత్తంలో విరాళాన్ని చెల్లించిన హీరో ప్రభాస్‌సే కావడం విశేషమని నెటిజన్లు అనుకుంటున్నారు. ఆయన గొప్ప మనసుని మెచ్చుకుంటున్నారు. మరోవైపు టాలీవుడ్ నుంచి ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కేరళకు విరాళం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ రూ.కోటి విరాళంగా ప్రకటించారు. అల్లు అర్జున్ రూ.25 లక్షలు కేరళ సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్లు తెలిపారు. తమిళ, మళియాల నటులు కూడా భారీగా విరాళలు అందించారు.