స్వతంత్ర, వెబ్ డెస్క్: తాను ఆ పార్టీలో చేరుతానని ఊహించని బీఆర్ఎస్ స్థానిక నేతలకు నిద్ర పట్టడం లేదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి వడ్డీతో సహా తిరిగిచ్చే సమయం వచ్చిందని హెచ్చరించారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్‌పై తాను యుద్ధం ప్రకటించి ఐదు నెలలు అవుతుందన్నారు. తండ్రిలా భావించిన కేసీఆర్ తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను పట్టించుకోని ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని తేల్చిచెప్పారు. తాను ఏ పార్టీలో చేరేది రెండు, మూడు రోజుల్లోనే హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా వెల్లడిస్తానని.. అనంతరం ఖమ్మంలో భారీ బహిరంగసభ ఉంటుందని ప్రకటించారు. అయితే ఆయన అనుచరుల్లో మెజార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరాలని చేసిన సూచనతో పొంగులేటి సైతం అదే నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.