19.7 C
Hyderabad
Thursday, February 5, 2026
spot_img

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ గందరగోళం

   మహారాష్ట్ర రాజకీయ చిత్రం మహా గందరగోళం లా కన్పిస్తోంది. మహారాష్ట్ర హుందా రాజకీయాలకు ఒకప్పుడు పెట్టింది పేరు. రాష్ట్రంలో సీఎంగా పనిచేసిన ఎందరో. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర వహించారు. కేంద్రంలో ప్రధాని, డిప్యూటీ ప్రధాని, కేంద్ర కీలక మంత్రి పదవులు అలంకరించారు. ప్రస్తుతం శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలు చీలి లోక్ సభ ఎన్నికలవేళ…. ఆరుపార్టీలు … మూడు కూటము లుగా రాజకీయం తయారైంది. తమ ఉనికిని కాపాడుకునేందుకు అన్నిపార్టీలు నానా తంటాలు పడుతు న్నాయి. మరోవైపు పార్టీ గుర్తు గడియారం కోసం అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గం కోర్టులో కొట్లాడుతున్నాయి. ఎన్నికల్లో ప్రజలు ఎవరిని సిసలైన పార్టీగా ప్రకటిస్తారో చూద్దాం.

   మహారాష్ట్ర కు మహా చరిత్ర ఉంది. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధికంగా 48 మంది సభ్యులను పార్లమెం టుకు పంపేది మహారాష్ట్రే. ఒకప్పుడు మహారాష్ట్రను ఏలిన ఆరు పార్టీలు రెండు కూటములుగా ఏర్పడి.. ఎన్నికల గోదాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకపక్క శివసేన ఉద్ధవ్ బాలా సాహెబ్ థాక్రే , కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ వర్గంతో కూడిన మహా వికాస్ ఆఘాడీ .. మరో పక్క బీజేపీ, సీఎం ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని రియల్ శివసేన, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నాయకత్వంలోని రియల్ ఎన్సీపీలతో కూడిన మహా కూటమి. మరోవైపు పార్టీ గుర్తు గడియారం కోసం అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గం కోర్టులో కొట్లాడుతున్నాయి. ఈ గందరగోళం నేపథ్యంలో మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ చరిష్మా కూడా.. మహాకూటమి అభ్యర్థులను ఏ మేరకు గట్టెక్కిస్తుందో చూడాలి. మహారాష్ట్రను పూర్తిగా తన గ్రిప్ లోకి తెచ్చుకునేందుకు బీజేపీ గత పదేళ్లుగా సామ, దాన, భేదాలన్నీ ప్రయోగించింది. ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని శివసేనను, శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీని నిలువునా చీల్చేందుకు తన రాజకీయ చతురత ప్రదర్శించి సక్సెస్ అయింది. దీనివల్ల బీజేపీ పొందిన ప్రయోజనం ఏమిటో.. అనుమానమే. ప్రస్తుతం ఎన్సీపీ చీలికవర్గం, శివసేన షిండే వర్గం బీజేపీకి తోకపార్టీలుగా తయారయ్యాయి. ఈ తోక పార్టీలతో 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఏమేరకు రాజకీయ లబ్ధి పొందుతుందన్నదే ప్రశ్న.

  మహారాష్ట్ర లో 2024 లోక్ సభ ఎన్నికలు ఐదు దశల్లో జరుగుతాయి. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20 తేదీల్లో మొత్తం 48 నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తవుతాయి. జూన్ 4న ఫలితాలు. మొదటి దశలో ఏప్రిల్ 19న నాగపూర్, రామ్ టేక్, బందరా- గోడియా, గడ్చిరోలి – చిమూర్, చంద్రాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. రెండో దశలో ఏప్రిల్ 26న బుల్ధానా, అకోలా, అమరావతి, వార్ధా, యావత్మల్ వాషిమ్, హింగోలి, నాందేడ్, పర్భానీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. మే 7 న మూడో దశలో రాయ్ గఢ్, బారామతి, ఉస్మానాబాద్, లాతూర్, షోలాపూర్, మాధా, సాంగ్లీ, సతారా, రత్నగిరి-సింధుదుర్గ్, కొల్హాపూర్, హత్కనంగ్లే. స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. లోక్ సభఎన్నికలు నాల్గో దశలో మే 13న నందూర్బార్, జల్గావ్, రావేర్, జల్నా, ఔరంగాబాద్, మావల్, పుణె, షిరూర్, అహ్మద్ నగర్, షిర్డీ, బీడ్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. ఐదో దశలో మే 20న బృహత్ ముంబై మహానగర్ తో సహా ఎన్నికలు జరుగుతాయి. ముంబై నార్త్, ముంబై నార్త్ – ఈస్ట్, ముంబై నార్త్ వెస్ట్. ముంబై సౌత్, ముంబై సౌత్ సెంట్రల్, ధూలే, దిండోరి, నాసిక్, పాల్ఘర్, భివాండీ, కల్యాణ్, థానే నియోజ కవర్గాలకు పోలింగ్ తో మహారాష్ట్రలో ఎన్నికలు పూర్తవుతాయి.

   2019 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 48 స్థానాల్లో బీజేపీ 23, శివసేన 18, ఎన్సీపీ 4, కాంగ్రెస్ 1, ఒకచోట ఇండిపెండెంట్, ఎంఐఎం ఒక స్థానాలను గెలుచుకున్నాయి. మరాఠా రిజర్వేషన్ల విషయం ప్రస్తుతం కీలకంగా మారింది. మహారాష్ట్రలో బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ ప్రభుత్వం మరాఠాలకు చదువు, ఉపాధిలో రిజర్వేషన్లు కల్పించినా.. కోర్టు కష్టాలనుంచి బయటపడి అవి ఎంతవరకూ అమలవు తాయన్నది కోటి డాలర్ల ప్రశ్న మహారాష్ట్రలో కీలకమైన నియోజ కవర్గాల్లో బారామతి పవార్ కుటుంబం అడ్డా. 1984లో శరద్ పవార్ బారమతి నుంచి తొలిసారిగా ఎన్నికయ్యారు. మళ్లీ 1991 లో, తర్వాత 996 నుంచి 2004 వరకూ ఎన్నికవుతూ వచ్చారు. ఏళ్లుగడిచినా శరద్ పవార్ పట్టు ఆ నియోజక వర్గంలో సడడలేదు. శరద్ పవార్ తర్వాత ఆయన కుమార్తె సుప్రియా సూలే.. వరుసగా గెలుస్తూ వచ్చారు. ఈ సారి సుప్రియా సూలేతో పవార్ కుటుంబానికే చెందిన డిప్యూటీ సీఎం సతీమణి సునేత్ర పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజలు ఏ పవార్.. ను గెలిపిస్తారో చూడాలి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్