రౌడీ షీటర్లు నేర ప్రవృత్తిని మానుకొని సన్మార్గంలో జీవించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచిం చారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ లో రౌడీషీ టర్లకు ఆయన దిశా నిర్దేశం చేశారు. కుటుంబంలో ఒక వ్యక్తి పై రౌడీషీట్ నమోదైతే సమాజంలో ఆ కుటుంబం వివక్షకు గురవుతుందని సిపి తెలిపారు. రౌడీ షీటర్లు ప్రభుత్వ పథకాలను సైతం ఉపయోగించుకోలేరని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల వేళ ఎవరైనా ప్రలోభాలకు గురిచేసి నేరాలను ప్రోత్సహిస్తే ఫిర్యాదు చేయాల న్నారు. నేరాలను నియంత్రించడంలో క్రైమ్ స్టాపర్స్ గా మారి సమాజానికి మేలు చేయాలన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా ఉంటుందని… నేరాలకు పాల్పడితే చట్ట పరంగా చర్యలు తప్పవన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందని కమిష నరేట్ పరిధిలో చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని సిపి శ్రీనివాస్ కోరారు.


