ఏపీలో కౌంటింగ్ రోజు హింసకు చెక్ పెట్టేలా పోలీసులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇప్పటికే పోలింగ్ రోజు, ఆ తర్వా త హింసాకాండ చోటుచేసుకోవడంతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. హింసాత్మక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అణువణువునా జల్లెడ పడుతున్నారు పోలీసులు. రౌడీషీటర్స్, అనుమానితుల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్‌కు 13 రోజులే మిగిలి ఉండడంతో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అనుమాని తులపై గట్టి నిఘా పెట్టారు. ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన అల్లర్ల నేపథ్యంలో నిఘాను పెంచింది పోలీసు శాఖ. కౌంటింగ్ వరకు పోలీసుల కార్డన్ సెర్చ్ కొనసాగనుంది. ఎన్నికల తర్వాత అల్లర్లలో పాల్గొన్నవారిపై కొరడా ఝళిపిస్తున్నారు ఎన్నికలరోజు అల్లర్లకు పాల్పడ్డ 2 వేల 790 మందిని గుర్తించారు. ఎన్నికల తర్వాత అల్లర్లకు పాల్పడ్డ వెయ్యి 5 వందల 22 మందిని గుర్తించారు. కొందరిని అరెస్ట్ చేయగా.., మరికొందరికి 41 CRPC నోటీసులు జారీ చేశారు. 301 సమస్యాత్మక ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు పోలీసులు.


