26.5 C
Hyderabad
Saturday, February 28, 2026
spot_img

పాడి కౌశిక్‌ రెడ్డికి పోలీసుల నోటీసులు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి హైదరాబాద్‌లోని మాసబ్‌ ట్యాంక్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గురువారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తాను కరీంనగర్‌ కోర్టుకు హాజరుకావాల్సి ఉందని, విచారణకు ఈనెల 17న హాజరవుతానని కౌశిక్‌రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ విధులు అడ్డుకోవడం, బెదిరింపుల వ్యవహారంలో ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌ ఫిర్యాదు మేరకు గతంలో కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి మాసబ్‌ట్యాంక్‌ ఇన్‌స్పెక్టర్‌ పరశురామ్‌ను దర్యాప్తు అధికారిగా డీసీపీ విజయ్‌కుమార్‌ నియమించారు.

మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ డబ్బులకు అమ్ముడు పోయారని ఘాటు విమర్శలు చేశారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో కొడతారని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని రేవంత్ రెడ్డి అన్నారని..అందుకే ఆయననే ఆదర్శంగా తీసుకుంటామని చెప్పారు.

గతంలో జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి మైకు గుంజుకున్నారని పాడి కౌశిక్‌ రెడ్డి అన్నారు. కానీ ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రిగా ఉంటే.. అదే కేబినెట్‌లో జూపల్లి మంత్రిగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మీద పీడీ యాక్ట్‌ కింద కేసు పెట్టి 6నెలలు జైల్లో వేయాలని కుట్రలు చేసారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిపై చీటింగ్, పీడీ యాక్టు కింద కేసులు పెట్టి జైలులో వేయాలని డిమాండ్‌ చేశారు. రేవంత్ రెడ్డిపై మొత్తం 89 కేసులు ఉన్నాయని పాడి కౌశిక్‌ రెడ్డి చెప్పారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్