స్వతంత్ర వెబ్ డెస్క్: వర్షాల కారణంగా భారీగా ట్రాఫిక్ జాం అవుతున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక సూచన చేశారు. మంగళవారం, బుధవారం ఐటీ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు 3 దశల వారీగా లాగ్ అవుట్ చేసుకోవాలని సైబరాబాద్ పోలీస్ శాఖ సూచించింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఇక హైదరాబాద్ లో వరదల కారణంగా కాలనీలు నదులను తలపిస్తున్నాయి.
రోడ్లన్ని కూడా మోకాళ్ల లోతు నీటితో దర్శనమిస్తున్నాయి. ఇక ఈ సమయంలో ఉద్యోగులు ఆఫీస్ కు వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు తోడు భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఉద్యోగులు చుక్కలు చూస్తున్నారు. వర్షాల కారణంగా భారీగా ట్రాఫిక్ జాం అవుతున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక సూచన చేశారు. ఐటీ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు 3 దశల వారీగా లాగ్ అవుట్ చేసుకోవాలని సైబరాబాద్ పోలీస్ శాఖ సూచించింది.
ఫేజ్ – 1 ఐకియా నుండి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి. ఫేజ్ – 2 ఐకియా నుండి బయో డైవర్సిటి, రాయదుర్గం వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి. ఫేజ్ – 3 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి.
కాగా నగరంలో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరందరి పని వేళలు కూడా ఇంచుమించుగా ఒకేవిధంగా ఉంటాయి. దీనితో ట్రాఫిక్ జామ్ ఏర్పడి అటు వాహనదారులు ఇటు ట్రాఫిక్ పోలీసులు తిప్పలు పడుతున్నారు. ఇలా షిఫ్ట్ లు వైజ్ గా లాగ్ అవుట్ అయితే ఆయా సమయాల్లో ఉద్యోగులు నిర్దేశిత ప్రాంతాలకు చేరుకుంటారు. ఆలాగే ట్రాఫిక్ సమస్య తలెత్తదనే ఆలోచనతో పోలీసులు ఈ సూచన చేసినట్టు తెలుస్తుంది.