మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పంజాగుట్ట పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణలో స్టేట్ మెంట్ రికార్డ్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు. రహస్య ప్రాంతంలో ప్రణీత్ రావును పోలీసులు విచారిస్తున్నారు. ప్రణీత్‌రావు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసుల ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. అందులో ఉన్న డేటా మొత్తాన్ని రిట్రైవ్ చేయను న్నారు. గతంలో ప్రణీత్‌రావు వాడిన సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ప్రణీత్ వ్యవహారంలో సిటీ పోలీస్‌తో పాటు ఎఫ్ఎస్ఎల్ టీంతో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. పోలీస్ బృందాలు రెండు రోజుల పాటు ఎస్ఐబీలో కీలక ఆధారాలు సేకరించాయి. దాదాపు10 లక్షలకు పైగా కాల్ రికార్డింగ్స్‌ను స్టోర్ చేసినట్టు గుర్తించారు. డిసెంబర్ 4న రికార్డులను మొత్తాన్ని ప్రణీత్‌రావు తొలగించారు. తెలంగాణలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారు. ప్రణీత్ రావ్ లిస్టులో రాజకీయ నాయకులు, సీనియర్ పోలీస్ అధికారులు కూడా ఉన్నారు.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో విధుల దుర్వినియోగం, అనధికారిక ఫోన్ ట్యాపింగ్, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌ల ధ్వంసం కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులు మంగళవారం రాత్రి అతన్ని రాజన్న-సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అదుపులోకి తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబీలో డీఎస్పీ గా పనిచేసిన ప్రణీత్‌రావు అప్పట్లో విపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేశారనే అభియోగాలను ఎదుర్కొంటున్నారు. గత ఏడాది డిసెంబరు 4న ప్రణీత్‌రావు కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లను కాల్చివేశారంటూ ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ డి.రమేశ్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పంజాగుట్ట పోలీసులు ప్రణీత్‌రావుపై ఐపీసీ, పీడీపీపీ, ఐటీ చట్టాల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.