27.7 C
Hyderabad
Sunday, April 21, 2024
spot_img

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం …. చెలరేగిన రాజకీయ దుమారం

     లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అన్ని పార్టీల నేతలు ఈ వ్యవహారంపై నోరు విప్పుతున్నారు. తాము కూడా బాధితులమేనని అప్పటి ప్రతిపక్ష నేతలందరూ ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వం కూడా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ మాత్రం ఫోన్ ట్యాపింగ్‌ని కొట్టి పారేస్తోంది. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

    తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. ఇందులో పోలీస్ ఉన్నాతాధికారుల నుంచి, మంత్రులు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు సైతం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కున్న ముఖ్య నేతలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు బీజేపీ నేత రఘునందన్‌రావు. ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రమేయం ఉందని.. ఆయన ప్రమేయం లేకుండా ఇంత పెద్ద నేరం జరగదని రఘునందన్ రావు ఆరోపిం చారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో తానే మొదటివాడినని ఆయన చెప్పారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని గతంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయినట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజగోపాల్‌రెడ్డి, వివేక్ కూడా ఫిర్యాదు చేయాలని..ఈ కేసును పూర్తి పారదర్శకంగా విచారించాలని డీజేపీని రఘునందన్‌రావు కోరారు.

     మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఎంతటి వారున్నా విడిచి పెట్టొద్దని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులను వదిలిపెట్టబోమని ఆమె అన్నారు. తన భర్త కొండా మురళీ ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని ఆమె వ్యాఖ్యానించారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్ కుటుంబం కోట్లకు పడగలెత్తిందని కొండా సురేఖ ఫైర్ అయ్యారు.

   మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లు జైలుకు వెళ్లాల్సిందే అని మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చాక కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. ఈ విషయంలో కేటీఆర్ లై డిటెక్టర్‌ టెస్ట్‌కు ఒప్పుకుంటారా అని సవాల్ విసిరారు. అసలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని యెన్నం ప్రశ్నించారు. ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. 10 లక్షల ఫోన్లు ట్యాప్‌ చేశారని ప్రచారం చేస్తున్నారన్నారు. చేస్తే గీస్తే రెండో మూడో ఫోన్లు ట్యాప్‌ చేసి ఉంటారని అన్నారు. పథకాల నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికే ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి తెచ్చారని ఆరోపిం చారు. గుజరాత్‌ మోడల్ అంటే మత అలర్లు సృష్టించడమా అంటూ నిలదీశారు కేటీఆర్‌. మొత్తానికి లోక్‌సభ ఎన్నికల వేళ..తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం రాజకీయ దుమారం రేపుతోంది. బయటకు వస్తున్న నిజాలు.. వెలుగుచూస్తున్న అంశాలను గమనిస్తే.. ఇదేదో ఆషామాషీ వ్యవహారం కాదన్నది అర్థమవు తోంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్‌ కేవలం కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల వరకే పరిమితమైందా ? అనే కొత్త అనుమా నాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. మరి ఎన్నికల నాటికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగు తుందో చూడాలి.

Latest Articles

కల్తీ కల్లు మాఫియాపై స్వతంత్ర టీవీ కథనాలకు అధికారుల స్పందన

   కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు మాఫియాపై స్వతంత్ర టీవీ వరుస కథనాలకు అధికారులు స్పందించారు. ఆల్ఫ్రోజోలం, యూరియా, డైజోఫార్మ్, శాక్రీన్ వంటి హానికర మత్తు పదార్థాలకు కలుపుతూ ప్రజల ప్రాణాల తో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్