ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు చూస్తే జనం కసితో కాదు.. భయంతోనే ఓట్లు వేశారని తిరుపతి జనసేన ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ చాలెంజ్ చేసి మరీ జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారని చెప్పారు. వైసీపీ నేతలు చేసిన పాపాలే ఆ పార్టీని ఓడించాయని కిరణ్ రాయల్ అభిప్రాయపడ్డారు. మంత్రి రోజా పాపాల ఫలితం కూడా వైసీపీ ఓటమికి కారణం అన్నారు. ఘోరంగా ఓడిపోయిన జగన్ క్యాబినెట్ అసోం వెళ్లేందుకు ఏర్పాట్లు చేశామని, ప్రత్యేక రైలులో టికెట్లు కూడా బుక్ చేసినట్లు కిరణ్ రాయల్ ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే.. జగన్ ప్రమాణ స్వీకారానికి స్వాగత పోస్టర్లు వేస్తామని చెప్పామని, అయితే.. ఇప్పుడు ఆ అవసరం రాలేదన్నారు.


