16.7 C
Hyderabad
Thursday, January 9, 2025
spot_img

మోదీ కోసం చంద్రబాబు.. వాగ్ధానాల అమలు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు- షర్మిల

ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిలా రెడ్డి ప్రధాని మోదీ విశాఖ పర్యటనపై ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు.. మోదీ కోసం ఎదురుచూస్తుంటే ఆయన వాగ్ధానాల కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారంటూ తెలిపారు. విభజన హామీలపై చేసిన మోసాలపై ప్రజలు నిలదీసేందుకు ఎదురుచూస్తున్నారంటూ చెప్పారు.

చంద్రబాబు గారు..మీరు మోడీ కోసం ఎదురు చూస్తుంటే.. ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోంది. విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తోంది. తిరుపతి వేదికగా మీ సమక్షంలోనే రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా అన్నారు. 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని మీరు అడిగారు. మాటలు కోటలు దాటాయి తప్పిస్తే.. చేతలకు దిక్కులేదు. రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా హామీని అందరు కలిసి ఆటకెక్కించారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన పాపాన పోలేదు. ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టలేదు. పారిశ్రామిక కారిడార్లు స్థాపన జరగలేదు. 10 ఏళ్లు దాటినా పోలవరం నుంచి చుక్క నీరు పారలేదు.

కడప స్టీల్ కట్టలేదు. విశాఖ ఉక్కును రక్షించలేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల్లో కనీసం లక్ష ఉద్యోగాలు కూడా రాష్ట్రానికి ఇచ్చింది లేదు. విశాఖకు వస్తున్న ప్రధాని మోదీని, ముఖ్యమంత్రి చంద్రబాబుని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యణ్‌ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. విశాఖ వేదికగా ప్రధానితో ప్రత్యేక హోదా ప్రకటన చేయించండి. విభజన హామీలపై క్లారిటీ ఇప్పించండి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని మోడీతో పలికించండి… అని ఎక్స్ వేదికగా డిమాండ్‌ చేశారు వైఎస్‌ షర్మిలా రెడ్డి.

Latest Articles

ఏపీ అభివృద్ధి మా విజన్‌.. ప్రజల సేవే మా సంకల్పం- మోదీ

ఏపీ అభివృద్ధి తమ విజన్‌.. ఏపీ ప్రజల సేవే తమ సంకల్పమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. విశాఖకు వచ్చిన ఆయన రూ.2.08 లక్షల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్