కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏపీలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజల మధ్య ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజా సమస్యలు వినేందుకు మంత్రి నారా లోకేశ్ ప్రారంభించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి జనం బారులు తీరుతున్నారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారాలోకేష్‌ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించుకునేందుకు తెల్లవారుజాము నుంచే ప్రజలు పెద్దసంఖ్యలో వస్తున్నా రు. రాజధాని రైతులకు ఇచ్చే పెన్షన్‌ను గత ప్రభుత్వం నిలిపివేసిందని, తిరిగి మంజూరు చేయాలని పలువురు మంత్రిని కోరారు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలని ఏపీఎన్ఎస్ కమిటీ విజ్ఞప్తి చేసింది. కాగా ప్రత్యేక యంత్రాంగంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు.


