37.4 C
Hyderabad
Friday, March 14, 2025
spot_img

Hari Hara Veera Mallu: పవన్ బర్త్ డే సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తున్న భారీ హిస్టారికల్ డ్రామా ‘హరి హర వీర మల్లు’ నుంచి అభిమానులకు అద్భుతమైన బహుమతి లభించింది. ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్ పై ఏఎమ్ రత్నం ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం నుండి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కూడిన ఒక కొత్త పోస్టర్ ఈరోజు విడుదలైంది. శక్తిమంతమైన పోస్టర్‌లో గడ్డంతో ఉన్న పవన్ కళ్యాణ్ ఎరుపు సాంప్రదాయ దుస్తులు, నలుపు పైజామా ధరించి ఉన్నారు. ఆయన చేతిలో దెబ్బలు తిన్న శత్రువులు నేల మీద పడి ఉండటం, మట్టి దుమ్ము లేవడం మనం గమనించవచ్చు. ఈ చిత్రానికి ‘ది లెజెండరీ హీరోయిక్ అవుట్‌లా’ అని ఉప శీర్షికను జోడించి, ‘హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ గారూ’ అని చిత్ర బృందం శుభాకాంక్షలు తెలిపింది.

నేపథ్య సంగీతం పోస్టర్ ను మరింత శక్తిమంతంగా మార్చింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్-ఇండియన్ చిత్రం 17వ శతాబ్దానికి చెందిన చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన ఒక వ్యక్తి కథను చెబుతుంది. ఈ బహుభాషా చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. మొఘలులు మరియు కుతుబ్ షాహీ రాజుల కాలం నాటి కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించనుంది. పవన్ కళ్యాణ్ తొలిసారిగా చారిత్రక చిత్రంలో కనిపించనుండటం హరి హర వీర మల్లు సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఎం.ఎం. కీరవాణి అద్భుతమైన సంగీతం, విఎస్ జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ, తోట తరణి ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు ప్రధాన బలాలుగా నిలవనున్నాయి.

Latest Articles

మృత్యుదేవత ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎందుకు కబళిస్తుందో…? రెండు రోజుల వ్యవధిలో బాలుడు, పోలీసు అధికారి లిఫ్ట్ భూతానికి బలి – తెల్లారితే చాలు…రోడ్డు, జల,ఆకాశ, ఆకస్మిక..ఇలా ఎన్నో ఆక్సిడెంట్లు

ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఏ ప్రమాదం దాపురిస్తుందో.. మృత్యుదేవత ఎందరి ప్రాణాలు తీసేస్తుందో ఎవరికి తెలియదు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, విధి విధానాన్ని తప్పించడానికి ఎవరు సాహసించెదరు.. అనే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్