ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన దుర్ఘటనలో మృతిచెందిన అంగోతు మంగు కుటుంబ సభ్యులతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గురువారం వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ప్రమాదంలో తమ తండ్రిని కోల్పోయి ఒక రోజు గడిచినా ప్రభుత్వం నుండి ఇప్పటి వరకూ ఏ విధమైన సహాయం అందలేదన్నారు. జనసేన ద్వారా తమకు న్యాయం జరిగేలా చూడాలని మృతుని కుమారులు ఉమేష్, గణేష్… పవన్ కళ్యాణ్ ని అభ్యర్థించారు. తప్పనిసరిగా న్యాయం జరిగేలా చూస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జరిగిన సంఘటన చాలా బాధకరమని, కుటుంబ పెద్దను కోల్పోతే కలిగే బాధను అర్థం చేసుకోగలనని, బాధిత కుటుంబాలు అందరికీ న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుందన్నారు.
Read Also: ఎంత పెద్ద మగాడైనా ఎదిరిస్తా: మాజీ మంత్రి బాలినేని
Follow us on: Youtube, Koo, Google News