స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో పవన్ కల్యాణ్ ఆయనను కలిశారు. ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలు, పరిస్థితులపై చర్చిస్తున్నారు. ఇటీవల కాలంలో చంద్రబాబును పవన్ కలవడం ఇది మూడోసారి కావడం విశేషం. ఈ మధ్య ఢిల్లీ వెళ్లిన పవన్.. బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. ఇటు ప్రధాని మోదీపై చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించడంతో బీజేపీకి దగ్గర కానున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో చంద్రబాబుతో జనసేనాని భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా పొత్తులపై వీరిద్దరు చర్చిస్తున్నట్లు సమాచారం.