29.7 C
Hyderabad
Saturday, July 12, 2025
spot_img

హస్తిన పర్యటనలో పవన్‌కల్యాణ్‌ బిజీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఢిల్లీ పర్యటనలో బిజీ అయ్యారు. ఇవాళ హస్తినలో రెండో రోజు పర్యటనలో భాగంగా పార్లమెంట్‌లో ప్రధాని మోదీతో భేటీకానున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు, విభజన అంశాలు, కేంద్ర సహకారంపై ప్రధానితో చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. అలాగే.. జలజీవన్ మిషన్ స్కీమ్‌లో భాగంగా.. ఏపీకి రావాల్సిన నిధులను కోరనున్నారు. ఈ పథకాన్ని కొనసాగించాలని కోరుతారని సమాచారం. ఏపీలో తాగు నీటిపై ఫోకస్‌ పెట్టారు పవన్‌కల్యాణ్‌. ఇంటింటికీ కుళాయిని ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జల జీవన్ మిషన్ ద్వారా కుళాయిల ఏర్పాటు కోసం ఈ పథకాన్ని కొనసాగించాలని కోరనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పటికే పవన్‌కల్యాణ్‌ పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించిన ఆయన కేంద్ర సహాకారాన్ని కోరారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ని కలిసిన పవన్‌.. ఏపీ పర్యాటక అభివృద్ధిపై చర్చించారు. టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక యూనివర్శిటీ వంటి ఏడు అంశాలపై చర్చించారు. ఏపీకి ఉన్న సముద్ర తీరాన్ని టూరిజం కోసం అభివృద్ధి చేసే అంశంపై మాట్లాడారు. కేంద్రం సహకారం అందించి, భారీగా నిధులు ఇస్తే.. ఏపీ మళ్లీ టూరిజం ఎట్రాక్షన్‌గా మారుతుందని విన్నవించారు.

రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తోనూ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలోని రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. పిఠాపురం పరిధిలోని రైల్వే పనుల గురించి కేంద్ర మంత్రికి పలు విజ్ఞప్తులు చేశారు. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలోని సామర్లకోట – ఉప్పాడ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. ఈ రోడ్డులో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించిన పవన్.. నిరంతరంగా ఉండే ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి, రోడ్‌ కనెక్టివిటీని మెరుగుపరచడానికి రైల్వే ఓవర్ బ్రిడ్జి అవసరమని తెలిపారు. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి గతి శక్తి కార్యక్రమం ద్వారా మంజూరు చేయాలని కోరారు.

అలాగే పిఠాపురంలోని శ్రీపాద వల్లభ స్వామి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని రైల్వే శాఖ మంత్రికి తెలిపిన ఆయన.. భక్తులకు వీలుగా ఉండేలా నాలుగు ముఖ్యమైన రైళ్ళకు పిఠాపురం రైల్వే స్టేషన్‌లో హాల్ట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నాందేడ్ – సంబల్పూర్ నాగావళి ఎక్స్‌ప్రెస్, నాందేడ్ – విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం- సాయినగర్ షిర్డీ ఎక్స్‌‌ప్రెస్, విశాఖపట్నం- న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌లకు పిఠాపురంలో హాల్ట్ ఇవ్వాలని కోరారు. అలాగే మహారాష్ట్ర లాతూర్ నుంచి తిరుపతికి రైలు ఏర్పాటు చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలపై కేంద్ర రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి రుణాల్లో వెసలుబాటు కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్ట్ కోసం ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ నుంచి తీసుకొన్న రుణానికి సంబంధించి ప్రాజెక్టును 2026 డిసెంబర్ 31 వరకు పొడిగించాలని నిర్మలను కోరారు. అలాగే రుణ ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం రీయింబర్స్‌మెంట్‌ పద్దతిలో కాకుండా ముందస్తు చెల్లింపు పద్ధతిలో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న నిధుల కేటాయింపులోనూ మార్పులు చేయాలని కోరారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్