స్వతంత్ర వెబ్ డెస్క్: పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచి మణిపూర్ హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో చర్చ కోసం విపక్ష పార్టీలు పట్టుబట్టాయి. దాంతో ఎలాంటి తొలి వారం పూర్తిగా ఎలాంటి కార్యకలాపాలు లేకుండా ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది.
ఇప్పుడు మణిపూర్ అంశానికితోడు ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుకు వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగుతున్నారు. బుధవారం లోక్ సభ ప్రారంభం కాగానే మణిపూర్ అల్లర్లు, ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుకు వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దాంతో సభలో గందర గోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం రెండు గంటలకు సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. దాంతో సభాపతి లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు.